సంప్రదాయ పద్ధతుల్లో కొత్త కొత్త వంటలు

సంప్రదాయ పద్ధతుల్లో కొత్త కొత్త వంటలు

సంప్రదాయ చీరకట్టుతో.. నెత్తి మీద వంట సామాన్లు పెట్టుకుని ఐదుగురు ఆడవాళ్లు పొలం గట్ల మీది నుంచి నడుస్తూ వెళ్తుంటారు. నెత్తిమీది బుట్టల్ని ఒక చెట్టు కింద పెట్టి, వంట పనులు మొదలుపెడతారు. వీళ్లు చేసే ప్రతి వీడియోలో ఇంట్రో క్లిప్‌‌ కామన్‌‌గా ఉంటుంది. సంప్రదాయ పద్ధతుల్లో కొత్త కొత్త వంటలు చేస్తారు. తర్వాత ఆ ఫుడ్‌‌ని వాళ్లు తిని, మిగిలింది అనాథలకు, పిల్లలకు పంచి పెడతారు. వాళ్లు వంటలు చేయడం చూస్తే...చూసేవాళ్ల నోట్లో నీళ్లూరడం ఖాయం. 

తమిళనాడుకు చెందిన ఐదుగురు ఆడవాళ్లు కలిసి ‘విలేజ్‌‌ బేబీస్‌‌’ అనే ఒక కుకింగ్‌‌ ఛానెల్‌‌ నడుపుతున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా ఫేమస్‌‌ అయిన ‘‘విలేజ్‌‌ కుకింగ్‌‌ ఛానెల్‌‌” వాళ్లు చేసినట్టే  వీళ్లు కూడా ఇంగ్రెడియెంట్స్ అన్నీ వంట వండే ముందే రెడీ చేసుకుంటారు. ఇదొక్కటే కాదు.. విలేజ్‌‌ కుకింగ్‌‌ ఛానెల్‌‌తో దగ్గరి పోలికలు చాలా ఉన్నాయి. ఛానెల్‌‌లో మంచి కంటెంట్‌‌ కూడా ఉండడంతో తక్కువ టైంలోనే ఫేమస్ అయింది. వీళ్లు ఎన్నో కొత్త రకం వంటలు చేస్తున్నారు. వాటిలో ఇండియన్‌‌ రెసిపీలు ఉంటాయి. ఆ వంటల ఘుమఘుమలకు కొన్ని లక్షల మంది ఫిదా అయ్యారు. అందుకే ఈ ఛానెల్‌‌ ఏడున్నర లక్షల మంది అభిమానాన్ని అతి కొద్ది కాలంలోనే సంపాదించుకుంది. వీళ్ల వంటకాల్లో ఎక్స్‌‌పరిమెంట్స్‌‌ కూడా బాగానే ఉంటాయి. 

బ్యాక్‌‌ బోన్‌‌

ఈ ఛానెల్‌‌కు వాసుకి అన్నాదురై బ్యాక్‌‌బోన్‌‌. వాసుకి 2018లో యూట్యూబ్‌‌ రంగంలోకి అడుగు పెట్టింది. మొదట్లో ఒకదాని తర్వాత ఒకటి మూడు ఛానెళ్లు పెట్టింది. అందులో 2018 ఫిబ్రవరిలో పెట్టిన ‘స్వీటీ టీవీ’ ఛానెల్‌‌ బాగా పాపులర్ అయింది. ఈ ఛానెల్‌‌కు రెండు లక్షల మందికి పైగా సబ్‌‌ స్క్రయిబర్స్ ఉన్నారు. ఇందులో ఎక్కువగా డైలీ వ్లాగ్స్‌‌ పోస్ట్ చేస్తుంటుంది. 2018 మార్చిలో మరో ఛానెల్‌‌ ‘అంబుదాన్‌‌ వాసుగి’ అనే పేరుతో క్రియేట్ చేసింది. ఇందులో ఎక్కువగా బ్యూటీ టిప్స్‌‌ పోస్ట్ చేసేది. కానీ.. వీడియోలకు పెద్దగా వ్యూస్ రాలేదు.

ఈ ఛానెల్‌‌లో పోస్ట్ చేసిన ఒక్క వీడియో కూడా1000 వ్యూస్‌‌ మార్కును దాటలేకపోయింది. అందుకే ఈ ఛానెల్‌‌లో వీడియోలు పెట్టడం ఆపేసింది వాసుకి. అది సక్సెస్‌‌ కాకపోయినా వెనకడుగు వేయలేదు. అదే సంవత్సరం జూన్‌‌లో మరో ఛానెల్‌‌ పెట్టింది. అదే ‘స్వీటీ ఛాలెంజ్‌‌’ ఈ ఛానెల్‌‌లో ఫుడ్‌‌ ఈటింగ్‌‌ ఛాలెంజ్‌‌లు చేసేది. కానీ.. ఇది కూడా ఆమెకు పెద్దగా సక్సెస్‌‌ ఇవ్వలేదు. అందుకే కొన్నాళ్ల నుంచి ఈ ఛానెల్‌‌లో కూడా వీడియోలు పోస్ట్‌‌ చేయడం లేదు. ఎన్ని ఫెయిల్యూర్స్‌‌ వచ్చినా లెక్క చేయకుండా 2020 అక్టోబర్‌‌‌‌లో మళ్లీ ట్రై చేసింది. ఆ ప్రయత్నం పేరే ‘విలేజ్‌‌ బేబీస్‌‌’. ఈ ఛానెల్‌‌లో వాసుకితో పాటు మరో నలుగురు ఉన్నారు. అప్పుడప్పుడు వీళ్లలో ఎవరికైనా వీడియో చేయడానికి వీలుకాకపోతే వాళ్లకు బదులు మరొకరు వస్తారు. మొత్తంగా ఐదుగురికి తగ్గకుండా ఉంటారు ప్రతి వీడియోలో. 

సక్సెస్‌‌ బేబీస్‌‌

విలేజ్‌‌ బేబీస్‌‌ ఛానెల్‌‌ పెట్టిన తక్కువ టైంలోనే బాగా సక్సెస్‌‌ అయింది. వీళ్లు చేసే వీడియోలు బాగా వైరల్‌‌ అయ్యాయి. వీడియోల్లో అందరూ ఒకే రకమైన చీరలు కట్టుకోవడం వల్ల ఛానెల్‌‌ పేరు అందరికీ గుర్తుండిపోయింది. ఛానెల్‌‌కు సబ్‌‌స్క్రయిబర్స్‌‌ తక్కువగా ఉన్నా కొన్ని వీడియోలకు మిలియన్లలో వ్యూస్‌‌ వచ్చాయి. ప్రస్తుతం ఈ ఛానెల్‌‌ను 7 లక్షల 75 వేల మంది సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నారు. అయితే.. ఈ ఛానెల్‌‌లోని ‘అరేబియన్‌‌ ఫుల్‌‌ చికెన్‌‌ మండీ బిర్యానీ’ వీడియోకు ఏకంగా 17 మిలియన్ల వ్యూస్‌‌ వచ్చాయి. ఈ ఛానెల్‌‌ ఇచ్చిన సక్సెస్‌‌తో వీళ్లంతా కలిసి ఏడాదికే  ‘క్రేజీ బేబీస్‌‌’ పేరుతో మరో ఛానెల్‌‌ పెట్టారు. ఇందులో చిన్న చిన్న ఎక్స్‌‌పరిమెంటల్‌‌ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. వాటితోపాటు ఈటింగ్‌‌ ఛాలెంజ్‌‌ వీడియోలు కూడా పెడుతున్నారు. 

డిఫరెంట్‌‌ కంటెంట్‌‌

ఛానెల్‌‌లో ఇండియన్‌‌ వంటలతో పాటు చాలా రకాల కొత్త వంటలను పరిచయం చేస్తున్నారు.  అంతేకాకుండా చాలా ఎక్కువ క్వాంటిటీ వండుతారు. 82 కిలోల చేపల కూర, 200 కౌజు పిట్టలతో బిర్యానీ, 2 వేల గుడ్లతో బిర్యానీ, 150 కిలోల యాపిల్ హల్వా.. ఇలా చాలా రకాల వంటలు చేశారు. అంతేకాకుండా వంద కిలోల కుల్ఫీ తయారు చేసి రికార్డ్ క్రియేట్‌‌ చేశారు. సంప్రదాయ వంటలు చేయడంతోపాటు క్రిస్పీ చికెన్‌‌, వెయ్యి లేస్‌‌ ప్యాకెట్లతో సలాడ్‌‌, కిట్‌‌క్యాట్‌‌, డైరీ మిల్క్‌‌, డార్క్‌‌ ఫ్యాంటసీ చాక్లెట్లతో మిల్క్‌‌ షేక్‌‌ లాంటి వీడియోలు కూడా చేశారు. 
ž