మోడీ పిలుపుతో సెల్ఫ్ క్వారంటైన్‌లోకి
ముంబై: “ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. జనమంతా ఇంట్లోనే ఉండాలి ”అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినా చాలా చోట్ల ఆ మాటల్ని సీరియస్‌గా తీసుకోవడంలేదు. ఏదో ఒక కారణం చెప్పి రోడ్ల పైకి వస్తున్నారు. మహారాష్ట్ర థానేకి దగ్గరగా ఉండే పంజూ గ్రామస్తులు మాత్రం మోడీ ఆదేశాలను కరెక్ట్‌గా పాటిస్తున్నారు. 1400 మంది జనాభా ఉన్న ఈ గ్రామ ప్రజలు తమను తాము సెల్ఫ్ ఐసోలేషన్‌లో పెట్టుకున్నారు. ఈ ఊరు ఎప్పుడూ పచ్చదనంతో ఉంటుంది. ట్రెక్కింగ్‌కు కూడా అనువుగా ఉంటుంది. అందుకే ఈ గ్రామానికి టూరిస్టులు ఎక్కువమంది వస్తుంటారు . దీనిని దృష్టిలో పెట్టుకుని తమను తాము కాపాడుకునేందుకు వీలుగా బయటవాళ్లు గ్రామానికి రాకుండా బోర్డర్లను మూసేశారు. ముంబై నుంచి వచ్చే బోట్లను కూడా నిలిపేశారు. గ్రామంలోని కూలీలకు మిగతా కుటుంబాలు సాయం చేయాలన్న సర్పంచ్ తీర్మానాన్ని అంతా అమలుచేస్తున్నారు.
For More News..
