ఆ ఊర్లో అంతే... చెప్పులేసుకోరు.. బయటి వ్యక్తులను ముట్టుకోరు..

ఆ ఊర్లో అంతే...  చెప్పులేసుకోరు..  బయటి వ్యక్తులను ముట్టుకోరు..

 కంప్యూటర్ యుగంలో కూడా  మూఢనమ్మకాలను, గ్రామ ఆచారాలను .. కట్టుబాట్లను వదలిపెట్టడం లేదు.  టెక్నాలజీ పెరిగినా ఆంధ్రప్రదేశ్ లో ని ఓ పల్లెటూరులో  ఇంకా పాశ్చాత్య సంస్కృతిని ఫాలో అవుతున్నారు.  ఆగ్రామంలో జనాలు  చెప్పులేసుకోరు.. బయట వ్యక్తులను అంటుకోరు.. ఏదైనా అస్వస్థత వస్తే కనీసం ఆస్పత్రికి కూడా వెళ్లరు.  అంతేకాడండోయ్ ఇంకా చాలా సంప్రదాయాలను ఆ గ్రామంలో ప్రజలు పాటిస్తున్నారు. 

ఇప్పుడంటే ఆధునికత రంగు పూసుకుని సంప్రదాయాలకి, ఆచారాలకి పక్కన పెట్టేస్తున్నారు గాని అప్పట్లో మన దేశ సంస్కృతి సంప్రదాయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేవి. కాలం మారుతున్న కొద్దీ..టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆ సంస్కృతీ సంప్రదాయాలని కాదని పాశ్చాత్య సంస్కృతిని ఫాలో అయిపోతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం నాటి సంప్రదాయం అలాగే కొనసాగుతోంది. బయటకు వెళ్లినప్పుడే కాదు.. ఇంట్లో కూడా కొందరు చెప్పులు వదలరు.. అలాంటిది ఆ గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు. మనలాంటి వారు గ్రామం చూద్దామని వెళ్తే చెప్పులు గ్రామం బయటే విడిచిపెట్టాలి. ఇంతేనా? ఇంకా చాలా వింతలు ఉన్నాయి .అలాంటి ప్రాంతాల్లో తిరుపతి జిల్లాలోని పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలోని వేమన ఇండ్లు గ్రామం ఒకటి.

తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకాల మండలం ఉప్పర పల్లి పంచాయతీలోని వేమన ఇండ్లు గ్రామం . ఈ విలేజ్  గురించి అందరూ వింతగా చెప్పుకుంటారు. ఆ ఊళ్లో ఎవరు చెప్పులు వేసుకోరు. కలెక్టర్ కాదు.. కాదు ముఖ్యమంత్రి వచ్చినా ఊరి బయట చెప్పులు విప్పి లోపలికి రావాల్సిందే. తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న సంప్రదాయమట.. ఆ గ్రామస్తులు వాటినే పాటిస్తూ వస్తున్నారు.

 ఈ ఊరి ప్రజల కట్టుబాట్లు, ఆచారాలు చాలా యూనిక్ గా ఉంటాయి. చెప్పులేసుకుని నడి ఇంట్లో తిరిగే ఈ రోజుల్లో ఆ ఊరి ప్రజలు వందల కిలోమీటర్లు నడిచిన చెప్పులేసుకోరు. రోజులో ఒక్కసారైనా జంక్ ఫుడ్ టేస్ట్ చేసే జనాలు ఉన్న ఈ కాలంలో ఆ ఊరి ప్రజలు అసలు బయట ఫుడ్ జోలికి వెళ్లరు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.
 
ఈ గ్రామంలోకి ఇతరులను ఎవరినీ అనుమతించరు. గ్రామంలో ఉండేవారంతా పాలవేకారి, దొరవర్లు కులానికి చెందిన వారిగా చెప్పుకుంటారట. క్రీస్తు పూర్వము ఈ గ్రామంలో అందరూ ఒకే వంశానికి చెందినవారట. గ్రామస్తులంతా తమ ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామిని కొలుస్తారు. గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి, గంగమ్మ  పూజలు కూడా చేస్తారు. వేంకటేశ్వరుడిపై ఉన్న భక్తితోనే తాము చెప్పులు వేసుకోవడం మానేశామని గ్రామస్తులు చెబుతారు. ఊరికి ఎవరు వచ్చిన కూడా చెప్పులు విడిచి గ్రామంలోకి రావాలి.

Also Read :- హైదరాబాద్ సిటీలో ఎండ మండిపోతున్న ప్రాంతాలు

 

ఈ ఊరికి ఎవరు వచ్చినా ఆఖరికి జిల్లాస్థాయి అధికారి వచ్చినా సరే చెప్పుల్లేకుండా ఊరిలోకి అడుగు పెట్టాలి. ఇక గ్రామస్తులు అయితే బయటకెళ్ళి వచ్చిన ప్రతిసారి స్నానం చేసి ఇంట్లోకి వెళ్లాల్సిందే. ఈ ఊరు లోని ప్రజలు దాదాపు అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వీరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. దేవుడి మీద భక్తితో చెప్పులేసుకోవడం మానేశారు. విద్యార్థులు స్కూల్ కి వెళ్ళినా, ఉద్యోగులు డ్యూటీలకు వెళ్లినా చెప్పులేసుకోరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

ఇంకా ఈ గ్రామంలోకి వచ్చిన కొత్తవారిని వారు తాకరు. బయటకు వెళ్లినా ఎన్ని రోజులు ఉండాల్సి వచ్చిన అక్కడి ఆహారాన్ని తినరు. ఎక్కడికి వెళ్లినా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాతే ఆహారం తీసుకుంటారట. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరుడు కొలువుతీరినా గ్రామస్తులు అక్కడికి కూడా వెళ్లరట. ఎవరికైనా ఏ అనారోగ్యం వచ్చినా గ్రామంలో ఉన్న వేంకటేశ్వరుడి గుడిలో పూజలు చేస్తారు కానీ ఆసుపత్రికి మాత్రం వెళ్లరట. ఈ గ్రామంలో వారు కోవిడ్ టైమ్‌లో వ్యాక్సిన్ కూడా తీసుకోలేదట. తాము కొలిచే దేవుడే తమ ప్రాణాలు కాపాడతాడని నమ్ముతారట. 

అంతేకాదండోయ్.. ఈ ఊర్లో జంక్ ఫుడ్ నిషేధం. ఊరు ప్రజలు ఎవరు కూడా బయట ఫుడ్ తినరు. ఏదైనా పనిమీద ఊరు దాటి వెళ్లాల్సి వస్తే కచ్చితంగా సరిపడా తాగునీరు, ఆహారం తీసుకెళ్తారు. విద్యార్థుల సైతం స్కూల్లో పెట్టే మధ్యాహ్న భోజనం ముట్టుకోరు. అంతేకాదు ఈ ఊరి ప్రజలు ఆసుపత్రికి వెళ్లిన దాఖలాలే లేవట. ఎలాంటి జబ్బు చేసినా.. ఊర్లోనే వైద్యం చేస్తారు. ఆఖరికి పాము కరిచిన సరే ఆ ఊర్లో ఉండే పుట్ట చుట్టూ తిరిగితే విషం విరిగిపోతుందని వీరు నమ్ముతారట.

గర్భిణీలు సైతం ఆసుపత్రిలో కాన్పులు చేయించుకోరు. ఊర్లోనే ప్రసవాలు చేస్తారు. కరోనా సమయంలోను వీళ్ళు ఎవరు ఆసుపత్రిలో ముఖం చూడలేదట. ఇక ఆ ఊరి ఆడవాళ్లకు నెలసరి వస్తే ఊరి బయటకు వెళ్లి పోవాల్సిందే. ఊరి బయట వీరి కోసం ప్రత్యేకంగా రెండు పక్కా ఇల్లు నిర్మించారు. పీరియడ్స్ వస్తే కచ్చితంగా వారం రోజుల పాటు ఆ ఇళ్లలో ఉండాల్సిందే. అన్ని రోజులు ఆ ఇంటి యజమాని వారికి వంట వండి పెడతారు.

వేమన ఇండ్లు గ్రామంలో మొదట ఒకటే కుటుంబం ఉండేదట. ఆ తర్వాత 25 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో పిల్లలు సైతం పెద్దవాళ్లు చెప్పినట్లు సంప్రదాయాలు పాటిస్తారట. కాలం మారిపోయినా ఇంకా వెనుబాటుతనంలో ఉండిపోయిన ఈ గ్రామం ఆచారాలు, సంప్రదాయాలపై అనేకమంది పెదవి విరుస్తున్నారు. వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతులు వల్ల ఇప్పటివరకు వాళ్లకి ఎలాంటి సమస్య రాలేదట. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా.. కొన్ని కష్టతరంగా ఉన్న వేమన ఇండ్లు గ్రామ ప్రజలు ఇప్పటికీ అలాంటి సాంప్రదాయాలని కొనసాగిస్తున్నారు.