డబుల్ బెడ్ రూం ఇండ్లు ఆక్రమించుకున్న గ్రామస్తులు

డబుల్ బెడ్ రూం ఇండ్లు ఆక్రమించుకున్న గ్రామస్తులు

నిజామాబాద్ జిల్లా బస్వాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయడం లేదని స్థానికులు ఆందోళనకు దిగారు. ఇండ్ల నిర్మాణం పూర్తై మూడేళ్లు గడిచినా తమకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అర్థరాత్రి డబుల్  బెడ్ రూమ్ ఇండ్ల తాళాలు పగలగొట్టి.. ఆక్రమించుకున్నారు. ఇండ్లు పూర్తయినా తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు  తిరిగినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఏడేళ్ల క్రితం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి స్థలం లేకపోవటంతో తమ స్థలాన్ని ఇచ్చామని.. అయినా తమకు ఇండ్లు కేటాయించడటంలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. బస్వాపూర్ గ్రామంలో ప్రభుత్వం 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించింది. వీటి పంపిణీ కోసం గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.

For More News..

పబ్‎లో దొరికిన 148 మందిలో చాలామంది ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్

కొరియర్‎లో 92 కత్తులు

రెండు వారాల్లో రూ. 10 పెరిగిన పెట్రోల్ రేటు