కన్నెపల్లి మండలంలో వైన్​షాపు వద్దని గ్రామస్తుల ఆందోళన

కన్నెపల్లి మండలంలో వైన్​షాపు వద్దని గ్రామస్తుల ఆందోళన

బెల్లంపల్లి రూరల్, వెలుగు :  వైన్​ షాపు ఏర్పాటు చేయొద్దంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కన్నెపల్లి మండల కేంద్రంలో కొత్తగా ఓ వైన్ ​షాపు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఇక్కడ వైన్​ షాపు వద్దంటే వద్దని ఎస్సీ కాలనీ మహిళలు, గ్రామస్తులు నిరసనకు దిగారు. ఈ దారి గుండా నిత్యం మహిళలు, స్టూడెంట్స్​ వెళ్తారని.. తప్పతాగి యువతులను ఎవరైనా అల్లరి చేస్తే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.

అంతేకాకుండా పక్కనే రైతు వేదిక ఉందని, ఎప్పటికప్పుడు రైతులు వచ్చి వారి సమస్యలను అధికారులకు చెబుతారని, వైన్​షాపు పెట్టడం వల్ల ఇక్కడ ఇబ్బందిగా మారుతుందని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి వేరే చోటికి మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.