కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి
కడెం, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు.  కడెం మండలం సారంగాపూర్ లో రూ.12 లక్షలతో చేపట్టిన అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందన్నారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.

 నాణ్యతతో నిర్మించేలా అధికారులు, పర్యవేక్షించాలని సూచించారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యేను  సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పడగల భూషణ్, తుమ్మల మల్లేశ్, కుమ్మరి సుధాకర్, ముస్కు రాజేందర్ రెడ్డి, ఆకుల లచ్చన్న, కోల శ్రీనివాస్, బొడ్డు గంగన్న, మార్కపు లక్ష్మణ్, మాదాస పెద్ద రాజన్న, కుమ్మరి రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.