పారా పవర్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో వినయ్‌‌‌‌కు గోల్డ్‌‌‌‌

 పారా పవర్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో వినయ్‌‌‌‌కు గోల్డ్‌‌‌‌

కైరో: ఇండియా పారా పవర్‌‌‌‌ లిఫ్టర్‌‌‌‌ వినయ్‌‌‌‌.. పారా పవర్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిశాడు. శుక్రవారం జరిగిన 72 కేజీ జూనియర్‌‌‌‌ కేటగిరీ ఫైనల్లో వినయ్‌‌‌‌ 142 కేజీల బరువు ఎత్తి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. తొలి రెండు ప్రయత్నాల్లో 137, 142 కేజీలు లిఫ్ట్‌‌‌‌ చేసిన వినయ్‌‌‌‌ మూడో ప్రయత్నంలో 147 కేజీలు ఎత్తాడు. కానీ రిఫరీలు ఫౌల్‌‌‌‌గా ప్రకటించారు. 

పోలెండ్‌‌‌‌కు చెందిన మికోలాజ్‌‌‌‌ కోసియుబిన్సీకి (141 కేజీ), ఈక్వెడార్‌‌‌‌ లిఫ్టర్‌‌‌‌ సెబాస్టియన్‌‌‌‌ (137 కేజీ) వరుసగా సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. యూపీకి చెందిన వినయ్‌‌‌‌ 2024 పారా పవర్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లోనూ గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సాధించాడు. ‘ఈ పతకం నాది మాత్రమే కాదు. నాకు ఏమీ లేనప్పుడు నన్ను నమ్మిన ప్రతి వ్యక్తికి ఇది చెందుతుంది. గోరఖ్‌‌‌‌పూర్‌‌‌‌లోని చిన్న విధుల నుంచి కైరోలోని ప్రపంచ వేదిక వరకు సాగిన ఈ ప్రయాణం అంత సులభం కాదు. ఈ స్వర్ణాన్ని నా ఫ్యామిలీ, దేశం, యువ అథ్లెట్లకు అంకితమిస్తున్నా. నా సామర్థ్యాన్ని చూసి నన్ను తీర్చిదిద్దిన కోచ్‌‌‌‌ జితేందర్‌‌‌‌ పాల్‌‌‌‌ సింగ్‌‌‌‌, రాజిందర్‌‌‌‌ సింగ్‌‌‌‌ రహే, నితన్‌‌‌‌ ఆర్య సర్‌‌‌‌లకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని వినయ్‌‌‌‌ వ్యాఖ్యానించాడు. ఈ వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ కోసం ఇండియా ముగ్గురు జూనియర్లు, 22 మంది సీనియర్ అథ్లెట్లతో కలిపి 25 మంది పారా పవర్‌‌‌‌లిఫ్టర్లను బరిలోకి దించింది.