గెలిస్తే డిప్యూటీ సీఎం.. కానీ ఒక్క చోట కూడా ఖాతా తెరవలే.. బీహార్లో ఆ పార్టీ పరిస్థితి దారుణం..!

గెలిస్తే డిప్యూటీ సీఎం.. కానీ ఒక్క చోట కూడా ఖాతా తెరవలే..  బీహార్లో ఆ పార్టీ పరిస్థితి దారుణం..!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలకు అందని ఫలితాలు నమోదయ్యాయి. ఎన్డీఏ కూటమి గెలిచినప్పటికీ ప్రతిపక్ష మహాగట్బంధన్ నుంచి గట్టి పోటీ ఉంటుందని అందరూ భావించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అలాగే వచ్చాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తలకిందులు చేస్తూ.. బిగ్ హెడ్స్ అన్నీ పడిపోవడం బీహార్ లో సంచలనంగా మారింది. 

బీహార్ ఎన్నికల్లో మరో విచిత్రమైన పరిస్థితి  ఏంటంటే.. డిప్యూటీ సీఎం క్యాండేట్ ఓడిపోవడం. పొత్తులో భాగంగా వికశీల్ ఇన్సాన్ పార్టీ (VIP) అధ్యక్షుడికి డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసింది కూటమి. కూటమి గెలిస్తే డిప్యూటీ ఖాయం అనుకున్నారు. కానీ .. పోటీ చేసిన 12 స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఆపార్టీ అభ్యర్థులను షాకింగ్ కు గురిచేసింది. 

బీహార్ ఎన్నికల్లో VIP పార్టీ సింగిల్ డిజిట్ కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం ఫేస్ ముకేష్ సహానీ.. ఉపముఖ్యమంత్రిని నేనే అన్నట్లుగా ఆశలు పెట్టుకున్నారు. 12 స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించేందుకు మస్తు ప్రచారం చేశారు. కానీ.. ఒక్క చోట కూడా గెలవకపోవటంతో ఆయన ఆశలు అడియాశలయ్యాయి. 

►ALSO READ | బీహార్ అయిపోయింది.. రాబోయే ఎన్నికలు ఇవే.. మరో మూడు నెలల్లో పెద్ద సందడీ.. !

డిప్యూటీ ఇవ్వకుంటే కూటమి నుంచి బయటకు..?

ఆలూ లేదు చూలూ లేదు.. అన్నట్లు బీహార్ లో గెలుస్తామో లేదో అనే అయోమయంలో కాంగ్రెస్-ఆర్జడీ కూటమి ఉంటే.. నేనే డిప్యూటీ సీఎం.. మా పార్టీ పోటీ చేసిన 12 సీట్లు గెలుస్తున్నాం.. డిప్యూటీ ఇవ్వకుంటే బయటకు వెళ్లిపోతా.. అంటూ ముందు నుంచే కండిషన్స్, బెదిరింపులు మొదలుపెట్టాడు ముకేష్ సహానీ. కానీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం గమనార్హం. అదే విధంగా ఇక ఆ పార్టీ ఫూచర్ కూడా ప్రశ్నార్థకం అనే అంటున్నారు విశ్లేషకులు.