ఏంటీ దుస్థితి.. వైద్యంఅందక ఇద్దరు కొడుకులు మృతి..15 కిలోమీటర్లు.. భుజాలపై మోస్తూ..

ఏంటీ దుస్థితి.. వైద్యంఅందక ఇద్దరు కొడుకులు మృతి..15 కిలోమీటర్లు.. భుజాలపై మోస్తూ..

ఏంటీ దుస్థితి.. అత్యంత హృదయ విదారక ఘటన..టెక్నాలజీతో దూసుకుపోతున్నాం..గ్రహాలు చుట్టి వస్తున్నాం..అయిన అడ్వాన్స్డ్ టెక్ ప్రపంచంలో వైద్యం అం దక ఇద్దరు చిన్నారులు మృతి..కనీసం మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్ అందుబాటులో లేని దయనీయ దుస్థితి.. ఇద్దరు కొడుకులు మృత్యువాత పడి పుట్టెడు దు:ఖంతో ఉన్న ఆ తల్లిదండ్రులు.. వారి మృతదేహాలను భుజాలపై మోస్తున్న మనుసు కలచివేసే దారుణ పరిస్థితులు మరోవైపు.. మహారాష్ట్రలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 

మహారాష్ట్రలోని  అహేరీ తాలూకాకు చెందిన ఓ జంటకు ఇద్దరు కొడుకులు. జ్వరంతో బాధపడుతున్న ఆ ఇద్దరి చిన్నారులను ఆస్పత్రిలో తీసుకెళితే వైద్యం అందక చనిపోయారు.. కనీసం మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యం కూడా లేకపోవడంతో ..ఆస్పత్రి నుంచి 15 కి.మీలు దూరంలోని గడ్చిరోలిలోని వారి గ్రామానికి ఇద్దరు కొడుకుల మృతదేహాలను భుజాలపై మోసుకొని వెళ్లారు ఆ జంట.

10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇద్దరుద్ద మైనర్ బాలుర మృతదేహాలను వారి భుజాలపై వేసుకుని, బురదతో కూడిన అటవీ మార్గం గుండా వెళుతున్న ఆ జంట వీడియోను అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివాట్టిర్ ప్రదర్శించారు.

 ఇద్దరు తోబుట్టువులు జ్వరంతోబాధపడుతున్నారు..కానీ వారికి సకాలంలో చికిత్స లభించలేదు. రెండు గంటల వ్యవధిలో వారి పరిస్థితిస్థి క్షీణించింది. తరువాతి ఒక గంటలో ఇద్దరు అబ్బాయిలు చనిపోయారు ”అని వాడెట్టివాట్టిర్ విషాదానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇద్దరు మైనర్ల మృతదేహాలను వారి గ్రామానికి తరలించడానికి కూడా అంబులెన్స్ లేదు. తల్లిదంల్లి డ్రులు వర్షంలో బురద మార్గం గుండా 15 కిలోమీటర్లు నడవవ లసి వచ్చిందన్నారు. గడ్చిరోలి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకుస్థ సంబంధించిన భయంకరమైన వాస్తవం గురువారం (సెప్టెంబర్ 5, 2024) వెలుగులోకి వచ్చిందన్నారు విజయ్.