నోట్ల కట్టల వీడియోతో వైరల్ అయిన వెంకటేష్ నాయుడు ఎవరు..? ఇతనికి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా.. ?

నోట్ల కట్టల వీడియోతో వైరల్ అయిన వెంకటేష్ నాయుడు ఎవరు..? ఇతనికి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా.. ?

లిక్కర్ స్కాం కేసు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. లిక్కర్ స్కాం కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అంతే కాకుండా వెంకటేష్ నాయుడు వైసీపీ అధినేత జగన్, టీడీపీ ఎంపీ పెమ్మసానితో ఉన్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో వెంకటేష్ నాయుడు ఎవరు, అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. వెంకటేష్ నాయుడు మామూలోడు కాదని.. అన్ని పార్టీలు, సినిమా సెలెబ్రిటీలతో పరిచయాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

వెంకటేష్ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అని.. అతనొక పవర్ బ్రోకర్ అని.. ఎవరు అధికారంలో ఉంటే వారితో ఫోటోలు దిగుతూ వారిని మంచి చేసుకుంటాడని  తెలుస్తోంది. ప్రైవేట్ ఫ్లైట్ లలో తిరుగుతూ పారిశ్రామికవేత్తలకు కావాల్సిన పనులు చేయించి పెడుతూ ఉంటాడని అంటున్నారు. అయితే.. వైరల్ అయిన వీడియోలో వెంకటేష్ నాయుడు లెక్కిస్తున్న 35 కోట్ల రూపాయలు నగదు ఎవరిది అన్నదానిపై విచారిస్తున్నారు సిట్ అధికారులు.

వెంకటేష్ నాయుడు లెక్కిస్తున్న నోట్ల కట్టల్లో రెండువేల రూపాయల నోట్లు కూడా ఉండటంతో ఆ వీడియో ఎప్పుడు తీసినది అన్నదానిపై కూడా చర్చ జరుగుతోంది. ఆ వీడియో రెండు వేల రూపాయల నోట్లు రద్దు అయిన తర్వాత తీసిన వీడియోనా లేక తర్వాత తీసిన వీడియోనా అనే చర్చ జరుగుతోంది. వీడియోలో ఉన్న నోట్ల కట్టలు లిక్కర్ స్కాం కి సమందించినదా లేక వెంకటేష్ నాయుడు నిందితుడిగా ఉన్న మరో కేసు నందిగామలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిందా అన్న కోణంలో దర్యాప్తు  చేస్తున్నారు అధికారులు.