వైరల్ వీడియో: కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటా

వైరల్ వీడియో: కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటా

కడప: సామాన్యుడిని కాపాడాల్సిన పోలీసులే.. అక్రమార్కులతో చేతులు కలిపితే? రక్షిస్తారనుకున్న పోలీసులు రాత్రికి రాత్రే అడ్డం తిరిగితే? ఇలాంటి సంఘటనలతో ఏం చేయాలో తెలియక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసింది. 

వివరాలలోకి వెళితే.. కడప జిల్లా.. దువ్వూరు మండలం ఎర్రబల్లికి చెందిన అక్బర్ బాషాకు దాన విక్రయం ద్వారా ఎకరన్నరం భూమి లభించింది. ఆ భూమిపై దువ్వూరు మండల వైసీపీ నాయకుడు తిరుపాల్ రెడ్డి కన్నుపడింది. దాంతో తన భూమి తనకు దక్కేలా చూడాలంటూ.. జిల్లా ఎస్పీకి బాషా  ఫిర్యాదు చేశాడు. అయితే మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డిని కలిస్తే న్యాయం జరుగుతుందని ఎస్పీ బాషాకు చెప్పాడు. దాంతో బాషా సీఐ కొండారెడ్డిని కలిసి విషయం మొత్తం తెలిపాడు. సీఐ కూడా బాషా వైపు న్యాయం ఉందని.. న్యాయం జరుగుతుందని మాట ఇచ్చాడు. కానీ రాత్రికి రాత్రే డబ్బుకు అమ్ముడుపోయిన సీఐ కొండారెడ్డి.. మరుసటి రోజు తిరుపాల్ రెడ్డి వైపు మాట్లాడుతున్నాడు. పైగా తాను చెప్పినట్లు వినకపోతే ఎన్‎కౌంటర్ చేస్తానని బెదిరిస్తున్నాడని బాషా అంటున్నాడు. తనను తీవ్రంగా కొట్టి.. తన భార్యను స్టేషన్ నుంచి బయటికి గెంటించేసాడంటూ బాషా కన్నీరుమున్నీరవుతున్నాడు. తనను చంపి తన పొలంలోనే పాతి పెడతామని స్థానిక వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని బాషా చెబుతున్నాడు. తన భూమికి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చిందని.. కానీ ఆ ఉత్తర్వులను సైతం సీఐ కొండారెడ్డి బేఖాతరు చేస్తున్నాడని బాషా ఆవేదన వ్యక్తం చేశాడు. దాంతో తనకు 48 గంటల్లో న్యాయం చేయాలని.. లేనిపక్షంలో తన కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడతామని బాషా సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. ఆ వీడియో సీఎం జగన్‎కు చేరేవరకు షేర్ చేయాలని నెటిజన్లను కోరాడు. ఫేస్‎బుక్‎లో ఈ వీడియో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ  అన్బు రాజన్ సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు హుటాహుటిన బాషా ఇంటి వద్దకు చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

 

https://m.facebook.com/story.php?story_fbid=373176421153504&id=100032853193819&sfnsn=wiwspwa