వైరల్ వీడియో: నేల ఉబికి పై పైకి వచ్చేస్తోంది!

వైరల్ వీడియో: నేల ఉబికి పై పైకి వచ్చేస్తోంది!

చండీగఢ్: భూకంపాలు వచ్చినప్పుడు నేల బద్దలవడం అందరూ చూసుంటారు. కానీ అటువంటిదేం లేకుండా ఉన్నట్టుండి ఒక చెరువులో నేల పైకి ఉబికి వచ్చింది. హర్యానాలోని ఓ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనను కొందరు వ్యక్తులు వీడియో తీశారు. దీనిని జగత్ వాణి అనే ఫేస్‌బుక్ పేజీలో జులై 21న పోస్ట్ చేశారు. కేవలం రెండ్రోజుల్లోనే ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఇప్పటికే 57 లక్షల మంది ఆ వీడియోను చూశారు. దాదాపు 38 వేల మంది షేర్ చేయగా, 48 వేల మందికి పైగా లైక్ చేశారు. దాదాపు రెండున్నర వేల మంది నెటిజన్లు కామెంట్స్ చేశారు.

 
भाइयों ऐसा अजूबा देखा किसी ने कभी,,, आपको विश्वास नहीं होगा

Live वीडियो: जमीन के अंदर ऐसी हलचल, बनी चर्चा का विषय.! भाइयों ऐसा अजूबा देखा किसी ने कभी,,, आपको विश्वास नहीं होगा।VIRAL VIDEO वीडियो हरियाणा की है लेकिन किस शहर-गांव की है यह अभी पता नही लग पाया है। #viralvideo वीडियो वायरल | फॉलो करें

Posted by Jagat Vani on Wednesday, July 21, 2021

కేవలం 1.58 నిమిషాలు ఉన్న ఈ వీడియోలో ఒక వైపు నుంచి మొదలై నేల పైకి పొంగుతూ వెళ్లింది. ఆ వీడియో తీస్తున్న వ్యక్తి, అక్కడ ఉన్న వాళ్లను దూరం జరగాలని, నేల మరింత దూరం అలా ఉబుకుతూ రావొచ్చని హెచ్చరించడం వినిపించింది. అయితే ఇది కచ్చితంగా ఎక్కడ, ఏ రోజు జరిగిందన్న విషయంపై క్లారిటీ లేదు. ఇది జరగడానికి కారణమేంటన్నది కూడా తెలియనప్పటికీ, నెటిజన్లు తమ కామెంట్లలో రకరకాల వెర్షన్స్ చెప్పుకొచ్చారు. టెక్టానిక్ ప్లేట్లలో కదలికల వల్ల అయ్యుండొచ్చని కొంత మంది కామెంట్ చేశారు. భూమి లోపల ఉన్న అగ్ని పర్వతం వల్ల పొంగుతున్న లావానే ఈ ఘటనకు కారణమని మరి కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. వాతావరణంలో మార్పుల కారణంగా భూమి లోపల జరిగిన హై హీట్, ప్రెజర్ యాక్టివిటీ వల్ల ఇది జరిగి ఉండొచ్చని మరికొందరు అంటున్నారు. అయితే మరో నెటిజన్ మాత్రం ఇది టెక్నానిక్ యాక్టివిటీ అయ్యుండకపోవచ్చని, అదే అయితే చుట్టూ ప్రకంపనలు వచ్చేవని, భూతాపం వల్ల కింది పొరల్లో మీథేన్ గ్యాస్ ఏర్పడి ఉంటుందని, అక్కడ నీళ్లు ఉండడంతో నేల అలా బబుల్స్‌లా పొంగి ఉంటుందని కామెంట్ చేశాడు.