తిక్క కుదిరింది పో : బస్సులో సరదగా వీడియో తీశారు .. సస్పెండ్ అయ్యారు

తిక్క కుదిరింది పో :  బస్సులో సరదగా వీడియో తీశారు .. సస్పెండ్ అయ్యారు

కర్ణాటకలో భారీ వర్షం పడుతుండగా ఓ బస్సు డ్రైవర్ ఒక చేత్తో గొడుగు పట్టుకుని మరో చేత్తో బస్సు స్టీరింగ్ పట్టుకుని నడిపాడు. దీనంతా మహిళా కండక్టర్ వీడియో తీసింది.  దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఫుల్ వైరల్ గా మారింది. దీంతో ప్రతిపక్షాలు కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి.  రాష్ట్రంలో బస్సుల పరిస్థితి ఇలా ఉందంటూ ప్రభుత్వంపై సెటైర్లు వేశాయి. 

దీనిపై నార్త్‌వెస్ట్ కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్ విచారణ  చేయగా బస్సులో ఏ సమస్య లేదని..  డ్రైవర్ హనుమంతప్ప , కండక్టర్  అనిత సరదా కోసమే ఈ వీడియో తీశారని విచారణలో తేలింది.  విచారణ అనంతరం ఇద్దరిని కార్పొరేషన్  సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.  

డ్రైవర్‌ సరదా కోసం ఇలా చేస్తే  రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు, ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది కదా.. మీ సరదా కోసం ఇతరుల ప్రాణాలను పణంగా పెడుతారా అంటూ నిలదీస్తున్నారు. ఇలాంటి వాళ్లను సస్పెండ్ చేయడం కాదు ఉద్యోగం నుంచి తీసేశాయలని డిమాండ్ చేస్తున్నారు.