వీడియో: చీకటిపడే దృశ్యాలు ఆకాశం నుంచి చూస్తే..

వీడియో: చీకటిపడే దృశ్యాలు ఆకాశం నుంచి చూస్తే..
  • అద్భుత దృశ్యాలు కెమెరాలో బంధించిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యూపోలా

భూమిపైన చీకటి పడే అరుదైన దృశ్యాలను ఆకాశం నుంచి చూస్తే.. ఎంతో అద్భుతం అనిపించే అలాంటి దృశ్యాలను స్పేస్ టూరిజం టార్గెట్ గా పెట్టుకున్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యూపోలా చాలా ట్రాన్స్ పరెంట్ గా చిత్రీకరించింది. భూమికి సంబంధించిన అతి అద్భుతమైన దృశ్యాలను చిత్రీకరించిన క్యూపోలో వీడియోలను ఎలోన్ మస్క్ స్థాపించిన స్పేస్‌ఎక్స్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. కొద్దిసేపట్లోనే ఈ  వీడియో ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. 
భూమికి 585 కిలోమీటర్ల ఎత్తులో..
ఇన్ స్పిరేషన్ 4 మిషన్‌లో భాగంగా స్పేస్ ఎక్స్ సంస్థ నలుగురు ప్రైవేట్ వ్యోమగాములతో డ్రాగన్ క్యూపోలాను అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే. భూమిపై నుంచి ఆకాశంలో 585 కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొడుతున్న డ్రాగన్ క్యూపోలా భూమిపై ఏర్పడే సూర్యాస్తమయాన్ని చాలా ట్రాన్స్ పరెంట్ గా చిత్రీకరించింది. గతంలో అంతరిక్షం నుంచి ఎన్నో వీడియోలు తీసినా..  స్పేస్ ఎక్స్ ప్రత్యేక దృష్టి పెట్టి డ్రాగన్ క్యూ పోలాలో ప్రత్యేక ట్రాన్స్ పరెంట్ మెటీరియల్ తో వీడియో తీసే ఏర్పాటు చేశారు. డ్రాగన్ క్యూపోలా నిన్న శుక్రవారం సాయంత్రం భూమిపై చీకటిపడే వీడియోను తీయగా.. దాన్ని స్పేస్ ఎక్స్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో మొత్తం ప్రపంచం చూసే అవకాశం కల్పిస్తూ షేర్ చేసింది. ఈ వీడియోలో భూమిపై వెలుతురు క్రమంగా వెళ్లిపోయి చీకటిగా మారే దృశ్యాలు చాలా మనోహరంగా కనిపిస్తాయి. ఆకాశం నుంచి భూమిపై చీకటిపడే వీడియో ఎలా ఉందంటే.. సగం భూమిపై వెళుతురుంటే.. మిగిలిన సగం భూమి మీద చీకటి కనిపిస్తూ.. క్రమంగా స్పేస్ షిప్ ఉన్న వైపు భూమి చీకట్ల కలసిపోతుంది.. మరింకెందుకుఆలస్యం కింద ఉన్న వీడియో చూసేయండి..