నోటి కాడికి వచ్చిన కూడు.. నేలపాలైంది.. పులి చెప్పిన నీతి కథ

నోటి కాడికి వచ్చిన కూడు.. నేలపాలైంది.. పులి చెప్పిన నీతి కథ

అది పులి.. రోడ్డుపై ఉన్న ఓ చిన్నపాటి జంతువును  పట్టుకుంది.. నోటితో కరుచుకుని వెళుతుంతే.. దాని చూపు కొంచెం దూరంలో ఉన్న ఓ లావుగా ఉన్న పంది పిల్లపై పడింది. నోట్లోని చిన్నపాటి జంతువు కంటే.. దూరంగా ఉన్న పంది బాగుందని భావించి.. నోట్లో ఉన్న చిన్న జంతవును  వదిలేసి.. పంది పిల్ల వెంట పడింది. అయితే ఆ పంది పులికి చిక్కకుండా తప్పించుకుని అడవిలోకి వెళ్లిపోయింది. తీరా వెనక్కి తిరిగి చూస్తే.. వదిలేసిన జంతువు కూడా  మాయం అయిపోయింది.. ఇప్పుడు ఏమైంది.. నోటికాడి కూడు పోయింది.. ఆశగా వెళ్లిన ఆహారమూ దొరకలేదు.. ఇప్పుడు ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది... పులి చెబుతున్న నీతి కథ అంటూ షేర్లు చేస్తున్నారు నెటిజన్లు..

ఓ పులి అత్యాశకు పోయింది.  ఉన్నది పోయింది.. ఉంచుకున్నది పోయింది అన్న చందంగా.. వీడియోలో కనిపిస్తున్న పులి అత్యాశకు పోయి నోటికాడికి వచ్చిన కూడును చేజార్చుకుంది.  ఈ వీడియోను  ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నంద పోస్ట్ చేశారు.  అత్యాశకు పోతే మానవులకే కాదు జంతువులకు దురాశే మిగులుతుందనే విషయాన్ని తెలిపింది. 

ఈ వీడియోలో పులి నోట్లో ఓ చిన్న జంతువు ఉంది.  దానికి దూరంగా ఒక అడవి పందిని గమనించిన పులి.. దానిని వదిలి అడవి పంది వెనుక పడింది.   ఇక అంతే అడవి పంది దానిని తప్పించుకొని అడవిలోకి పరిగెత్తింది.  దానిని వెంబడించినా చిక్కలేదు. తిరిగి వెనక్కు చూసే సరికి వదిలేసిన జంతువు కూడా అక్కడలేదు.  రెండు జంతువులను తిందామన్న అత్యాశతో  వేటాడిన పులికి కనీసం ఒక్క జంతువు కూడా దొరకలేదు.  ఈ పులి బంగారు సూత్రాన్ని మర్చిపోయిందని   చేతిలోని పక్షి పొదలో రెండొందలు అనే టాగ్ ను హ్యాస్యంతో పోస్ట్ చేశాడు.   

 

This leopard forgot the golden principle-a bird in the hand is worth two in the bush?? pic.twitter.com/KwQUKlRzia

— Susanta Nanda (@susantananda3) July 3, 2023

ఈ వీడియో అప్‌లోడ్ చేసినప్పటి నుండి, వీడియో లక్ష  మంది చూడగా1600 లైక్‌లను పొందింది.చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు చిరుతపులి చర్యలను సమర్థించారు.   పందిపిల్లలకు ఆ రోజు అదృష్టం కలిసి వచ్చింది.. చిరుత పులి రెండవ పందిని పట్టుకోవడంలో విఫలమైంది..అంతే కాక రెండు పంది పిల్లలు పులి బారి నుంచి తప్పించుకున్నాయని ఒక యూజర్ పోస్ట్ చేశారు.  కొంతమంది  నెటిజన్లు మొదటి పందిపిల్ల గురించి కూడా అడిగారు, రెండు పందిపిల్లలు చిరుతపులి నుంచి  తప్పించుకోగలిగాయని తెలుసుకున్న తర్వాత ఉపశమనం వ్యక్తం చేశారు. ఆసక్తికరంగా  ఒక వినియోగదారు సుశాంత నందా యొక్క శీర్షిక UPSC EPFO ​​పరీక్షలో ఒక ప్రశ్నలో భాగమని, ప్రశ్నపత్రం యొక్క స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు.  ఏది ఏమైనా దురాశ దు:ఖానికి చేటు అని మానవులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది.