Viral video: ఇదేం కొట్టుడురా బాబూ.. బస్సు ఆపకపోతే పొట్టుపొట్టు కొడతారా

Viral video: ఇదేం కొట్టుడురా బాబూ.. బస్సు ఆపకపోతే పొట్టుపొట్టు కొడతారా

ఇదేం కొట్టుడురా బాబూ.. బస్సు ఆపకపోతే ఇంతలా కొడతారా.. ముక్కు మోహం పగిలిపోయేలా కొడతారా..ఇష్టం వచ్చిన చోట దించకపోతే దాడి చేయడమేనా.. ఆపాల్సినచోట బస్సు ఆపలేదని.. కండక్టరును దారుణంగా కొట్టారు. ఏకంగా ఐదుగురు వ్యక్తులు కండక్టరుపై పడి పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా క్యాష్ బ్యాగ్ ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఈ ఘటన శనివారం (ఫిబ్రవరి 10) జరిగింది. ఈ ఘటన సంబంధించిన దృశ్యాలు బస్సులో ఉన్న  సీసీ కెమెరాల్లో రికార్డయింది. వివరాల్లోకి వెళితే.. 

చితిరం నుంచి తువ్వకుడి వెళ్లే బస్సులో వరగనేరి చులైకరై మరియమ్మన్న ఆలయం వద్ద ఓ మహిళా ప్రయాణికురాలు కండక్టర్ తో  గొడవ పడింది. కండక్టరు మూకయ్యన్ ఆమెను దిగాల్సిన చోట దించలేదని.. కొంచెం ముందుకు దింపాడని గొడవకు దిగింది. కండక్టర్ , మహిళ మధ్య మాటా మాటా పెరిగింది. తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. 

బస్సు  చతిరామ్ బస్టాండ్ కు తిరిగా రాగానే ఐదుగురు వ్యక్తులు బస్సు ఎక్కి కండక్టర్ పై దాడికి పాల్పడ్డారు. కండక్టర్ మహిళా ప్రయాణికురాలిని అసభ్యంగా తిట్టాడని ఆరోపిస్తూ తీవ్రంగా కొట్టి, క్యాష్ బ్యాగ్ లాక్కెళ్లేందుకు యత్నించారు దుండగులు. 

ఇదంతా చూసిన బస్సులోని మహిళా ప్రయాణికులు కొందరు ఆ ఐదుగురిని అడ్డుకొని కండక్టర్ ను రక్షించారు. ఈ ఘటనపై సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కండక్టర్. కేసు నమోదు చేసుకున్ పోలీసులు కండక్టరును కొట్టిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.