సింహాల మధ్య ఫైట్.. బతికిపోయిన బర్రె

సింహాల మధ్య ఫైట్.. బతికిపోయిన బర్రె

సింహాల మధ్య జరిగిన పొట్లాట, వాటికి ఆహారంగా మారబోయిన గేదెకు  ప్రాణ భిక్ష పెట్టింది. సింహాల గుంపు బర్రెల మందపై దాడి చేసి ఒక బర్రెను దొరకబచ్చుకున్నాయి. ఏం జరిగిందో తెలియదు కానీ.. దాన్ని తినే సమయంలో సింహాల మధ్య గొడవ జరిగింది. ఒక దానిపై మరొకటి దాడి చేసుకున్నాయి. అవి సీరియస్ గా కొట్లాడుకుంటూ తనను గమనించడం లేదని గుర్తించిన గేదె.. మెల్లగా అక్కడి నుంచి తప్పించుకుంది.

చావు నోట్లోకి  వెళ్లి బతికి బయటపడ్డాను అనుకొని..  బర్రె అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. దూరంగా నిలబడి సింహాల పొట్లాటను గమనిస్తున్న తన తోటి గేదెల గుంపు వద్దకు చేరుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్వీట్లు... రీట్వీట్లు చేస్తూ.. నెటిజన్లు రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు.