ద‌యానంద్ స‌ర‌స్వతీని సంద‌ర్శించిన  విరుష్క దంపతులు 

ద‌యానంద్ స‌ర‌స్వతీని  సంద‌ర్శించిన  విరుష్క దంపతులు 

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ మ్యాచ్ లు లేకుంటే ఎక్కువగా ఆధ్యాత్మిక సేవలో గడుపుతున్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌కు ముందు తన భార్య అనుష్క శర్మతో కలిసి రుషికేష్‌ టూర్‌కు వెళ్లాడు. అక్కడ ప్రధాని మోడీ ఆధ్యాత్మిక గురువైన స్వామి ద‌యానంద్ స‌ర‌స్వతీ ఆశ్రమాన్ని సంద‌ర్శించారు. ద‌యానంద్​ స‌మాధిని దర్శించుకుని ఆశీస్సులను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని స్వామిజీ దగ్గర దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్ చేయగా  వైరల్‌ అయ్యాయి. ఇటీవల విరుష్క దంపతులు తమ కూతురు వామికాతో కలిసి బాబా నీమ్ కరోలి బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించి బాబా ఆశీర్వాదాలు తీసుకున్నారు. 

న్యూజిలాండ్ తో వన్డే మ్యాచ్ లు ఆడిన విరాట్‌ కోహ్లీ ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు సిద్దమవుతున్నాడు. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ఇరుజట్ల మధ్య తొలిటెస్టు మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ ఏడాది వ‌రల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఉండండతో  దాంతో ఈ టెస్టు సిరీస్ కీల‌కం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైన‌ల్ బెర్తు ఖ‌రారు చేసుకోగా పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో ప్లేస్ లో ఉంది.  మార్చి 17 నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.