ODI World Cup 2023: ఒకే ఒక్కడు: సచిన్ ఆల్‌టైం రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లీ

ODI World Cup 2023: ఒకే ఒక్కడు: సచిన్ ఆల్‌టైం రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లీ

వరల్డ్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడు. సచిన్ రికార్డులను ఒకొక్కటిగా బద్దలు కొడుతూ వస్తున్న విరాట్ తాజాగా మరో ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసాడు. వన్డేల్లో ఒకే క్యాలెండర్ (జనవరి-డిసెంబర్) అత్యధిక సార్లు 1000 పరుగుల మార్క్ అందుకున్న తొలి ప్లేయర్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 8 సార్లు ఒకే ఏడాది కోహ్లీ ఫీట్ సాధించాడు. 

నిన్నటివరకు  ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ తో సమంగా ఉన్న కోహ్లీ.. ప్రస్తుతం వరల్డ్ కప్ లో శ్రీలంకపై 34 పరుగులు చేయడం ద్వారా మాస్టర్ బ్లాస్టర్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. సచిన్ 1994, 1996, 1997, 1998, 2000, 2003, 2007 లలో మొత్తం 7 సార్లు ఈ ఘనత అందుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2023 సంవత్సరాలలో 1000 కి పైగా 8 సార్లు ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. 

ALSO READ : ODI World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచ్‌ల బ్లాక్ టికెట్ల దందా.. బీసీసీపై కేసు నమోదు!

కోహ్లీ, సచిన్  తర్వాత భారత మాజీ సారధి సౌరవ్ గంగూలీ, ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్, శ్రీలంక మాజీ స్టార్ ప్లేయర్ కుమార సంగక్కర 6 సార్లు ఈ ఫీట్ నమోదు చేశారు. ఇక ప్రస్తుతం శ్రీలంకపై వాంఖడే వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. 28 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 172 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(84), గిల్ (75) క్రీజ్ లో ఉన్నారు.