Kohli: కోహ్లీ బ్యాట్ ఝుళిపిస్తే..సెహ్వాగ్ రికార్డు బద్దలే

Kohli: కోహ్లీ బ్యాట్ ఝుళిపిస్తే..సెహ్వాగ్ రికార్డు బద్దలే

ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ తర్వాత మంచి ఫాంలో ఉన్న కోహ్లీ..బంగ్లా, న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన సిరీస్లలో పరుగుల వరద పారించాడు. దీంతో ఆసీస్తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్లో అందరి కన్ను కోహ్లీపైనే ఉండనుంది. ఈ నేపథ్యంలో మరోసారి కోహ్లీ బ్యాట్ ఝుళిపిస్తే...పలురికార్డులు అతని ఖాతాలో చేరనున్నాయి. 

విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకు ఏడు సెంచరీలు సాధించాడు.  దీంతో ఆసీస్పై అత్యధిక సెంచరీలు కొట్టిన టీమిండియా ఆటగాళ్లలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. మొదటి  స్థానంలో 11 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఆ తర్వాత 8 సెంచరీలతో సునీల్ గవాస్కర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ సిరీస్లో కోహ్లీ కనీసం రెండు సెంచరీలు బాదితే గవాస్కర్ను దాటేస్తాడు. లేదా నాలుగు సెంచరీలు కొడితే సచిన్ రికార్డును సమం చేస్తాడు. 

ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును కూడా బద్దలు కొట్టే ఛాన్సుంది. కోహ్లీ ఇప్పటి వరకు టెస్టుల్లో 49 సగటుతో 8119 పరుగులు సాధించాడు. అయితే ఈ నాలుగు టెస్టుల్లో కోహ్లీ గనక 391 పరుగులు చేస్తే.. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్ జాబితాలో సెహ్వాగ్ రికార్డును బద్దలు కొడతాడు. సెహ్వాగ్ తన కెరీర్లో 8503 పరుగులు చేశాడు. కోహ్లీ 391 రన్స్ కొడితే భారత్ తరపున టెస్టుల్లో అధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా నిలుస్తాడు.