ముంబై: ఒకవైపు రిషబ్ పంత్ కెప్టెన్సీలోని జట్టు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతుండగానే... ఇండియా టెస్టు టీమ్‌లోని కీలక ఆటగాళ్లు ఇంగ్లండ్ టూర్‌కు బయల్దేరారు. మాజీ కెప్టెన్ కోహ్లీతోపాటు గిల్, శార్దూల్, బుమ్రా, సిరాజ్, పుజారా, షమీ, విహారి, కేఎస్ భరత్ తదితరులు గురువారం ఇంగ్లండ్ విమానం ఎక్కారు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయాల నుంచి కోలులేదు. వాళ్లు ఫిట్‌నెస్ సాధిస్తే.. సౌతాఫ్రికాతో సిరీస్ ఆడుతున్న మరికొందరు ప్లేయర్లతో కలిసి కొన్ని రోజుల్లో ఇంగ్లండ్ వెళ్తారు. బర్మింగ్‌హామ్ వేదికగా జులై 1-–5 మధ్య ఏకైక టెస్టు జరుగుతుంది.
