ప్రపంచ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

ప్రపంచ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

గువాహటి వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్ లో హాఫ్‌ సెంచరీ కంప్లీట్ చేసిన కోహ్లీ ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 257 మ్యాచ్ లో 12,500 పరుగులు పూర్తి చేసి కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.  ఇక కోహ్లీ తరువాత  సచిన్ (310 మ్యాచ్ ల్లో) , రిక్కీ పాటింగ్ (328  మ్యాచ్ ల్లో) 12,500  పరుగులు చేశారు. దీంతో వన్డేల్లో అత్యంత వేగంగా 12,500  పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

ఇక ఈ మ్యాచ్ లో కనుక కోహ్లీ సెంచరీ చేస్తే సచిన్  పేరిట ఉన్న మరో రికార్డును సమం చేసినవాడు అవుతాడు. స్వదేశంలో సచిన్ 20 సెంచరీలు సాధించగా, విరాట్ కోహ్లీ  ఇప్పటివరకు 19 సెంచరీలు చేశాడు. ఇక వన్డే ఫార్మాట్‌లో లంకపై సచిన్‌ 8 సెంచరీలు చేయగా కోహ్లీ కూడా ఎనిమిది సెంచరీలను చేసి సమంగా ఉన్నాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేస్తే  లంకపై 9 శతకాలు సాధించిన బ్యాటర్‌గా నిలుస్తాడు.ప్రస్తుతం కోహ్లీ 81 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.