
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అభిమానులకి కేవలం తన బ్యాటింగ్ తోనే పాటు తన ఆటిట్యూడ్ తో కూడా మంచి కిక్ ఇస్తాడు. బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కూడా కెమెరా కళ్లన్నీ విరాట్ వైపే ఉంటాయి. ఈ క్రమంలో కోహ్లీ ఒక నేపాలీ పాటకు డ్యాన్స్ వేస్తూ కనిపించాడు. నేపాలీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 15 ఓవర్ ప్రారంభంలో కోహ్లీ చిందులేస్తూ కనిపించడం విశేషం. కోహ్లీ ఇలా చిందులేయడం చూసి గ్రౌండ్ మొత్తం ఆనందంతో ఊగిపోయారు.
కోహ్లీ చిందులకి అమ్మాయిలు ఫ్లాట్
విరాట్ కోహ్లీకి అమ్మాయిల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చాలా స్టైలిష్ గా ఉండే విరాట్ చాలా మంది అమ్మాయిల కళల రాకుమారుడు. ఇటీవలే పాకిస్థాన్ కి చెందిన ఒక మహిళ కోహ్లీ కోసం ఏకంగా శ్రీలంక వచ్చింది. తన సపోర్ట్ పాకిస్థాన్ కే అని చెప్పిన ఆ మహిళ బాబర్ కంటే తనకు విరాట్ కోహ్లీ అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ విషయం పక్కన పెడితే నిన్న నేపాల్ తో మ్యాచ్ సందర్భంగా విరాట్ కాలు కదపగా అమ్మాయిలు కూడా విరాట్ ని చూసి డ్యాన్స్ వేయడం గమనార్హం. విరాట్ క్రేజ్ అంటే మరి ఆ మాత్రం ఉంటుంది. అంటూ అభిమానాలు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం విరాట్ స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Virat Kohli danced on the field after seeing Nepal's beautiful girl dancing to the Nepali song.
— Silly Context (@SillyMessiKohli) September 5, 2023
A beautiful scene of how music has no boundaries.pic.twitter.com/bCOy9iBSKd#AsiaCup