సచిన్ మరో రికార్డుపై కన్నేసిన కోహ్లీ

 సచిన్ మరో రికార్డుపై కన్నేసిన కోహ్లీ

ఇండియా, న్యూజిలాండ్‌‌‌‌ జట్ల మధ్య  ఇవాళ చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండోర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలని టీమిండియా భావిస్తుంటే .. మూడో వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కివీస్ ఆలోచిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో సచిన్‌ రికార్డుపై టీమిండియా స్లార్  బ్యాట్స్ మెన్ విరాట్  కోహ్లీ టీమిండియా మాజీ ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ రికార్డులపై కన్నేశాడు.

ఈ మ్యాచ్ లో కనుక కోహ్లీ హాఫ్ సెంచరీ సాధిస్తే కివీస్ పై ఎక్కువ హాఫ్‌ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా కోహ్లీ  రికార్డు సృష్టిస్తాడు. . ప్రస్తుతం విరాట్, సచిన్‌  13హాఫ్‌ సెంచరీలతో ఈక్వెల్ గా ఉన్నారు.  ఒకవేళ కోహ్లీ కనుక సెంచరీ చేస్తే మాత్రం కివీస్‌పై ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాటర్‌ గా  వీరేంద్ర సెహ్వాగ్‌ (6)తో సమంగా కోహ్లీ (5) నిలుస్తాడు.  కివీస్ తో మొదటి వన్డేలో లో సెంచరీ చేసిన కోహ్లీ రెండో వన్డేలో అంతగా రాణించలేకపోయాడు.