ఆసియా కప్ కోసం కసరత్తు స్టార్ట్

ఆసియా కప్ కోసం కసరత్తు స్టార్ట్

ముంబై:  టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ ఆసియా కప్‌‌‌‌ టీ20 టోర్నమెంట్‌‌‌‌కు ప్రిపరేషన్స్‌‌‌‌ షురూ చేశాడు.ఇంగ్లండ్‌‌‌‌ టూర్‌‌‌‌ తర్వాత  వెస్టిండీస్‌‌‌‌ టూర్‌‌‌‌కు దూరంగా ఉండి మూడు వారాల  బ్రేక్‌‌‌‌ తీసుకున్న అతను గురువారం  ట్రెయినింగ్‌‌‌‌ మొదలు పెట్టాడు.  ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్​లోని ఎస్‌‌‌‌సీఏ ఇండోర్‌‌‌‌ అకాడమీలో విరాట్‌‌‌‌ సొంతంగా ట్రెయినింగ్‌‌‌‌ చేస్తున్నాడు. ఇక, రోహిత్‌‌‌‌ శర్మ 
కెప్టెన్సీలోని టీమిండియా ఆసియా కప్‌‌‌‌ కోసం ఈనెల 20న దుబాయ్‌‌‌‌ బయల్దేరనుంది. అంతకుముందే ప్లేయర్లంతా  ఈనెల 18న ఎన్‌‌‌‌సీఏలో ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ టెస్ట్​కు హాజరుకానున్నారు.  అనంతరం దుబాయ్‌‌‌‌లో మూడు రోజుల ట్రెయినింగ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌లో పాల్గొంటారు.    ఆసియాకప్‌‌‌‌లో భాగంగా ఈనెల  28న జరిగే తొలి మ్యాచ్‌‌‌‌లో ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌‌‌తో పోటీ పడనుంది.