IND Vs ENG: ఎనిమిదేళ్లలో రెండే ఓటములు..కోహ్లీ కెప్టెన్సీని గుర్తు చేస్తూ రోహిత్‌పై విమర్శలు

IND Vs ENG: ఎనిమిదేళ్లలో రెండే ఓటములు..కోహ్లీ కెప్టెన్సీని గుర్తు చేస్తూ రోహిత్‌పై విమర్శలు

ఉప్పల్ టెస్టులో టీమిండియా ఓడిపోవడంతో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అదే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ విమర్శలకు గురవుతున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే టెస్టు కెప్టెన్సీ. టెస్టుల్లో కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడూ భారత్ సొంతగడ్డపై రెండే సార్లు ఓడిపోయింది. మరోవైపు రోహిత్ శర్మ చివరి కెప్టెన్సీలో చివరి మూడు టెస్టుల్లో రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. దీంతో ఫ్యాన్స్ కోహ్లీని గుర్తు చేసుకుంటూ.. రోహిత్ కెప్టెన్ బాగోలేదంటున్నారు. 

2014 చివరలో MS ధోనీ నుండి కోహ్లీ సారధ్య బాధ్యతలు చేపట్టాడు. కోహ్లీ కెప్టెన్సీలో స్వదేశంలో భారత్ మొత్తం 31 టెస్ట్ మ్యాచ్ లాడితే 24 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. కేవలం రెండే మ్యాచ్ లు ఓడిపోయింది. 5 మ్యాచ్ లు డ్రాగా ముగిసాయి. స్వదేశంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై మాత్రమే ఈ 8 ఏళ్ళల్లో భారత్ ఓడిపోయింది. స్వదేశంలోనే కోహ్లీ కెప్టెన్సీలో భారత్ విదేశాల్లోనూ విజయాలను సాధించింది. ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడంతో పాటు.. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రాత్మక విజయాలను సాధించింది. 

ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విషయానికి వస్తే 2022 ప్రారంభంలో భారత టెస్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటివరకు ఆరు టెస్టు మ్యాచ్ లాడితే చివరి మూడు టెస్టుల్లో రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులు గెలిచిన తర్వాత మూడో టెస్ట్ ఓడిపోవడంతో పాటు నాలుగో టెస్ట్ డ్రా చేసుకుంది. ఇక తాజాగా నిన్న జరిగిన హైదరాబాద్ టెస్టులో భారత్ కు ఊహించని పరాజయం ఎదురైంది. మొత్తానికి రోహిత్ కెప్టెన్సీలో భారత్ చివరి మూడు మ్యాచ్ ల్లో విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.