2024 టీ20 వరల్డ్ కప్ నుంచి కోహ్లీ ఔట్..? విరాట్ ప్లేస్‌ను భర్తీ చేసేది అతడే

2024 టీ20 వరల్డ్ కప్ నుంచి కోహ్లీ ఔట్..? విరాట్ ప్లేస్‌ను భర్తీ చేసేది అతడే

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టీ20 కెరీర్ సందిగ్ధంలో పడింది. కోహ్లీ చివరి టీ20 ఆడి ఏడాది దాటిపోయింది. చివరిసారిగా 2022 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై సెమీ ఫైనల్ ఆడిన విరాట్.. ఆ తర్వాత టీ20 లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో  వచ్చే ఏడాది జూన్ లో 2024 టీ20 వరల్డ్ కప్ కు కోహ్లీ జట్టులో ఉండడమే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 

నివేదికల ప్రకారం విరాట్ కోహ్లి ప్రపంచ కప్ 2024,  T20 ప్రపంచ కప్ ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.  T20I, IPLలో కోహ్లీకి అద్భుతమైన రికార్డ్ ఉన్నప్పటికీ.. బోర్డు మిడిల్ ఆర్డర్‌లో ప్రత్యామ్నాయ కోసం చూస్తున్నట్లు సమాచారం. జైస్వాల్, గైక్వాడ్, కిషాన్, గిల్ లాంటి యంగ్ ప్లేయర్లు టాపార్డర్ లో బాగా రాణిస్తుండడంతో విరాట్ ఎంపిక కష్టంగానే కనిపిస్తుంది. పైగా వీరందరూ ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్నారు. గిల్ ఇప్పటికే తనను నిరూపంచుకోగా.. జైస్వాల్, గైక్వాడ్, కిషన్ ఆస్ట్రేలియా సిరీస్ లో అదరగొట్టారు. 

నెంబర్ 3 లో ప్రారంభం నుంచి అటాకింగ్ చేసే బ్యాటర్ కోసం ఇషాన్ కిషన్ ను విరాట్ స్థానంలో తీసుకోవచ్చని బీసీసీఐ భావిస్తోందట. ఐపిఎల్ 2024 ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటాయట. అయితే  ఆర్సీబీ తరపున కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. దీంతో కోహ్లీ బాగా ఆడినా ప్రయోజనం లేనట్టుగానే కనిపిస్తుంది.  కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, ఇతర బోర్డు అధికారుల మధ్య జరిగిన సమావేశంలో T20 ప్రపంచ కప్ కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ కు దూరంగా ఉన్నా ఈ ఇద్దరు టీ20 వరల్డ్ కప్ కు ఆడటం దాదాపు ఖాయమైంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కోహ్లీ తన భవిష్యత్తు గురించి సంప్రదిస్తానని అధికారి తెలిపారు. దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 10 నుంచి మూడు టీ20లకు కోహ్లీకి రెస్ట్ ఇచ్చారు. 2024 వరల్డ్ కప్ కు ముందు భారత్ ఆఫ్ఘనిస్థాన్ తో మూడు టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడుతుంది. మొత్తానికి కోహ్లీ టీ20 భవిష్యత్తు మరి కొన్ని రోజుల్లో తేలనుంది.