
ఆసియాకప్2022లో సెంచరీతో చెలరేగిన టీమిండియా బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ..టీ20 ర్యాంకింగ్స్లో దుమ్మురేపాడు. ర్యాంకింగ్స్లో ఏకంగా 15 స్థానాలు ఎగబాకి..15వ ర్యాంకును దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ టూర్ తర్వాత నెల రోజుల పాటు రెస్ట్ తీసుకున్న కోహ్లీ..టీ20ల్లో 29వ ర్యాంకుకు పడిపోయాడు. అయితే విశ్రాంతి అనంతరం ఆసియాకప్లో బరిలోకి దిగిన కోహ్లీ..మళ్లీ ఫాం అందుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్ పాక్పై రాణించాడు. ఆ తర్వాత హాంకాంగ్, పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆఫ్ఘాన్పై ఏకంగా సెంచరీ చేయడంతో...టోర్నీలో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో కోహ్లీ ర్యాంకు మెరుగైంది.
టాప్ -10లో ఒక్కడే..
టీ20 ర్యాంకింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా నుంచి ఈ ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. అతను నెంబర్ 4 స్థానంలో ఉన్నాడు. మరోవైపు పాకిస్థాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ టాప్ 1 స్థానంలో ఉండగా.. ఎయిడెన్ మార్క్‌రమ్ రెండో స్థానంలో నిలిచాడు. బాబర్ ఆజామ్ మూడో ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఆరోన్ ఫించ్, డేవాన్ కాన్వే, పాతుమ్ నిస్సంక, ముహమ్మద్ వసీం, రీజా హెండ్రీక్స్ వరుసగా టాప్-10లో చోటు దక్కించుకున్నారు.
ఏడో స్థానంలో భువీ.
ఆసియాకప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన భువనేశ్వర్ కుమార్..బౌలింగ్ విభాగంలో ఏడో స్థానంలో నిలిచాడు. లంక ఆసియాకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వానిందు హసరంగా ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ర్యాంకింగ్స్లో జోష్ హజెల్ వుడ్ నెంబర్ ప్లేస్లో ఉండగా..టబ్రైజ్ షంసీ, ఆదిల్ రషీద్, ఆడమ్ జంపా, రషీద్ ఖాన్ వరుసగా టాప్ 5లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ఒక్కడే టాప్ 10లో నిలిచాడు. ఈ జాబితాలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టాప్ పోజిషన్లో కొనసాగుతున్నాడు. మహమ్మద్ నబీ రెండో స్థానంలో నిలిచాడు.