
- రేపటి నుంచి కేప్ టౌన్ లో మూడో టెస్ట్
- నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన ఇండియా కెప్టెన్
- రేపటి నుంచి కేప్‌టౌన్‌లో మూడో టెస్ట్
కేప్‌టౌన్: ఇండియా క్రికెట్ టీమ్‌కు, ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. బ్యాక్ పెయిన్ కారణంగా సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ రికవర్ అయ్యాడు. మంగళవారం నుంచి కేప్‌టౌన్‌లో జరిగే మూడో టెస్టులో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆదివారం ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. నెట్ సెషన్‌కు వచ్చిన కోహ్లీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కవర్ డ్రైవ్స్, ఆఫ్ డ్రైవ్స్ కొడుతూ కనిపించాడు. ఈనేపథ్యంలో థర్డ్ టెస్టులో తను కచ్చితంగా బరిలోకి దిగుతాడని అర్థం అవుతోంది. ఇక, సెకండ్ టెస్టు ఓటమి నుంచి వెంటనే రికవర్ అవ్వాలని టీమ్ భావిస్తోంది. మనకు అచ్చొచిన జొహన్నెస్‌బర్గ్ వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో కోహ్లీ లేని లోటు కనిపించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో టీమ్ కొన్ని మిస్టేక్స్ చేసింది. వాటిని సరిదిద్దుకొని సిరీస్ విజేతను తేల్చే కేప్‌టౌన్ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలని కెప్టెన్ విరాట్, కోచ్ ద్రవిడ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ ట్రెయినింగ్ సెషన్‌లోనే ప్లేయర్లంతా ఫుల్ ఫోకస్‌తో కనిపించారు. న్యూలాండ్స్ స్టేడియంలో కోచ్ ద్రవిడ్ గైడెన్స్‌లో ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది.
కోహ్లీతో పాటు మయాంక్, రహానె, పుజారా, శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బుమ్రా, షమీ, అశ్విన్, ఇషాంత్ బౌలింగ్ చేశారు. అయితే అందరి ఫోకస్ మాత్రం కోహ్లీపైనే నిలిచింది. నెట్ సెషన్‌లో తను చాలా ఉత్సాహంగా కనిపించాడు. ఇషాంత్, బుమ్రా బౌలింగ్‌లో ఈజీగా షాట్లు కొట్టాడు. కోహ్లీ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తే... మూడో మ్యాచ్‌లో హైదరాబాదీ హనుమ విహారి ఫైనల్ ఎలెవన్ నుంచి తప్పుకోవాల్సిందే. ఇక, సెకండ్ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డ మరో హైదరాబాదీ సిరాజ్ నెట్ సెషన్‌కు రాలేదు. తను తొడ కండరాల గాయం నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిరాజ్ మూడో మ్యాచ్ దూరం కానున్నాడు. తన ప్లేస్‌లో సీనియర్ పేసర్ ఇషాంత్ బరిలోకి దిగే చాన్స్ ఉంది. నెట్ సెషన్‌లో లంబూ సీరియస్‌గా బౌలింగ్ చేశాడు.
మూడో మ్యాచ్‌కు పేస్ వికెట్
థర్డ్ మ్యాచ్‌లో గెలిచి సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ సాధించాలని పట్టుదలగా ఉన్న కోహ్లీసేనకు కేప్‌టౌన్ న్యూలాండ్స్ క్రికెట్ స్టేడియంలో పేస్ వికెట్ వెల్‌కం చెబుతోంది. ఫస్ట్ రెండు మ్యాచ్‌లతో పోలిస్తే మరింత పేస్ లభించే వికెట్‌ను మూడో మ్యాచ్ కోసం రెడీ చేశారు.