IND vs AFG: కోహ్లీ వచ్చేశాడు.. తెలుగు కుర్రాడిపై వేటు తప్పదా..?

IND vs AFG: కోహ్లీ వచ్చేశాడు.. తెలుగు కుర్రాడిపై వేటు తప్పదా..?

ఆఫ్ఘనిస్తాన్ తో నేడు భారత్ రెండో వన్డేకు సిద్ధమైంది. ఇండోర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ సొంతం  చేసుకుంటుంది. ఇప్పటికే తొలి టీ20 గెలిచిన రోహిత్ సేన నేడు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు షాక్ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇదిలా ఉండగా నేడు టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ జట్టులో చేరనుండడంతో ఎవరిని తప్పిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.
 
ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని.. బీసీసీఐ పలు మార్పుతో జట్టును ఎంపిక చేసింది. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ వంటి జూనియర్లను తప్పించి సీనియర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు జట్టులో చోటు కల్పించింది. అయితే కోహ్లీ తొలి మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. తన కూతరు వామిక పుట్టిన రోజు కావడంతో విరాట్ తొలి టీ20 ఆడలేదు. అయితే నేడు జట్టులో చేరనుండడంతో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఈ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది.
 
తొలి టీ20లో తిలక్ వర్మ ప్రస్తుతం నెంబర్ 3 లో బ్యాటింగ్ చేశాడు. కోహ్లీ ఎంట్రీ ఇవ్వనుడడంతో తిలక్ బెంచ్ మీద కూర్చోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ తిలక్ వర్మ జట్టులో కొనసాగితే ఓపెనర్ గిల్ పై వేటు పడొచ్చు. ధర్మశాలలో జరిగిన తొలి టీ20 లో తిలక్ వర్మ 22 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ తో 26 పరుగులు చేశాడు. గిల్ 12 బంతుల్లో 5 ఫోర్లతో 23 పరుగులు చేశాడు. మరోవైపు కోహ్లీ 14 నెలల తర్వాత తొలి టీ20 ఆడబోతున్నాడు. దీంతో అందరి కళ్లన్నీ ఈ స్టార్ బ్యాటర్ పైనే ఉన్నాయి.