సౌతాఫ్రికా నుంచి విరాట్ రిటర్న్

సౌతాఫ్రికా నుంచి విరాట్ రిటర్న్
  •     ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా ముంబై వచ్చిన కోహ్లీ
  •     రేపు తిరిగి సెంచూరియన్‌‌కు!
  •     గాయంతో టెస్టు సిరీస్‌‌‌‌కు రుతురాజ్ దూరం

సెంచూరియన్‌ ‌‌‌:  సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌‌‌‌కు ముందు టీమిండియాలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్టార్ క్రికెటర్ విరాట్‌‌‌‌ కోహ్లీ స్వదేశానికి తిరిగొచ్చేశాడు. చేతి వేలికి గాయం కారణంగా యంగ్ ఓపెనర్‌‌‌‌‌‌‌‌ రుతురాజ్ గైక్వాడ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ నుంచి వైదొలిగాడు. అయితే, తొలి టెస్టు మొదలయ్యే సమయానికి కోహ్లీ తిరిగి జట్టులో చేరుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇది ముందుగా నిర్ణయించిన సెలవు కావడంతో కోహ్లీ గురువారమే  ముంబైకి బయల్దేరాడని వెల్లడించాయి.  అయితే, కోహ్లీ ఫ్యామిలీలో ఎలాంటి ఎమర్జెన్సీ ఉందనే విషయంపై బోర్డు స్పష్టత ఇవ్వలేదు. కానీ, అతను ఈ నెల 24 కల్లా సౌతాఫ్రికా చేరుకొని ట్రెయినింగ్ సెషన్‌‌‌‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. మరోవైపు సౌతాఫ్రికాతో రెండో వన్డేలో క్యాచ్‌‌‌‌ అందుకునే క్రమంలో రుతురాజ్‌‌‌‌ చేతి వేలికి గాయం అయింది. వేలుకు ఫ్రాక్చర్‌‌‌‌‌‌‌‌ అవ్వడంతో తను  టెస్టు సిరీస్‌‌‌‌ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదు.