రింకూ బ్యాటింగ్ వేరే లెవల్..నేను అస్సలు ఊహించలేదు

రింకూ బ్యాటింగ్ వేరే లెవల్..నేను అస్సలు ఊహించలేదు

విరాట్ కోహ్లీ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్మన్. జట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా..కోహ్లీ ఉన్నాడంటే అభిమానులకు నమ్మకం గెలిపిస్తాడని. అందుకే ప్రపంచ వ్యాప్తంగా మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు, అభిమానులు కోహ్లీ ఆటకు ఫిదా అవుతారు. అతని ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తారు. అయితే అందరి చేత మన్ననలు పొందే కోహ్లీ..యువ క్రికెటర్ ను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆ యువ క్రికెటర్ ఆటతీరుకు కోహ్లీ ఫిదా అయ్యాడట. 

అలా నేను ఆడలేను...

గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య  జరిగిన మ్యాచులో  చివరి ఓవర్లో 29 పరుగులు చేయాల్సి దశలో రింకూ సింగ్ చిచ్చరపిడుగుల చెలరేగాడు. వరుసగా ఐదు సిక్సర్లు బాది కేకేఆర్ ను గెలిపించాడు. అయితే రింకూ సింగ్ ఇన్నింగ్స్పై స్పందించిన విరాట్ కోహ్లీ అతన్ని ఆకాశానికెత్తాడు. రింకూను తెగ మెచ్చుకున్న కోహ్లీ..తాను కలలో కూడా అలా జరుగుతుందని ఊహించలేదన్నాడు. ఇలా తాను చెయ్యగలననే ఊహ కూడా ఎప్పుడూ రాలేదని చెప్పాడు. ఐపీఎల్లో కుర్రాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని..వారి బ్యాటింగ్ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నాడు. 

షాకయ్యా..

ఐపీఎల్‌లో యువఆటగాళ్లు అద్బుతంగా ఆడుతున్నారని కోహ్లీ మెచ్చుకున్నాడు. రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు బాదడం చూసి షాకయ్యానని చెప్పాడు. ఈ విధంగా గతంలో ఎప్పుడూ జరగలేదన్నాడు. ఒక మ్యాచ్ గెలవడానికి వరుసగా ఐదు సిక్సర్లు కొట్టడం అంటే మాటలు విషయం కాదన్నాడు. రింకూ సింగ్ ది వేరే లెవల్ బ్యాటింగ్ అని చెప్పాడు. క్రికెట్లో వస్తున్న మార్పులకు ఇదే నిదర్శనం అని కోహ్లీ వెల్లడించాడు.