బీచ్లో సేదతీరుతున్న కోహ్లీ

బీచ్లో సేదతీరుతున్న కోహ్లీ

విరాట్ కోహ్లీ ఆటను ఎంతగాప్రేమిస్తాడో...ప్రకృతిని అంతే ప్రేమిస్తాడు. అందుకే కొంచెం ఖాళీ దొరికితే చాలు..వైఫ్ అనుష్క, కుమార్తె వామికాతో కలిసి ప్రకృతి ఒడిలో వాలిపోతుంటాడు. ఇన్నాళ్లు తీరికలేని క్రికెట్ ఆడిన విరాట్..కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని...ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నాడు. దక్షిణాఫ్రికా బీచ్‌లో అనందంగా గడుతున్నాడు. 

వేసవిలో వరుసగా ఐపీఎల్ మ్యాచులు ఆడిన కోహ్లీ అలసిపోయాడు.  దీంతో సౌతాఫ్రికా సిరీస్కు విశ్రాంతి కావాలని బీసీసీఐని కోరడంతో..ఈ సిరీస్కు అతన్ని ఎంపికచేయలేదు. అయితే త్వరలో ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్తో పాటు, వన్డే, టీ-20 సిరీస్ జరగనుంది. గతేడాది కొవిడ్ కారణంగా మిగిలిపోయిన ఒక టెస్టు జులై 1 నుంచి మొదలు కానుంది. ఆ తర్వాత టీ-20, వన్డే సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టూర్కు ముందు సౌతాఫ్రికాకు వెకేషన్కు వెళ్లిన కోహ్లీ..బీచ్లో హాయిగా సేదతీరుతున్నాడు. సముద్రపు ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇసుకలో కూర్చొని హాయిగా రిలాక్స్ అవుతున్నాడు.  కేవలం షార్ట్ వేసుకొని ఇసుకలో కూర్చున్న విరాట్‌..  క్రికెట్‌ ఆలోచనలను లేకుండా ప్రశాంతంగా సముద్రాన్ని చూస్తున్నాడు. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో  ఫొటోను విరాట్‌ పోస్ట్ చేశాడు. ఈ ఫోటో వైరల్గా మారింది.  ఇప్పటికే మిలియన్ల కొద్దీ లైక్స్‌, వేల కామెంట్స్‌ వచ్చాయి.


 
భారత్ త్వరలో ఇంగ్లాండ్లో పర్యటించనుంది.  గతేడాది కరోనా కారణంగా రద్దయిన ఐదో టెస్ట్ జులై 1 నుంచి మొదలు కానుంది.  అయితే ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్లో భారత్ ఇప్పటికే 2-1 తో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ఈ మ్యాచ్ను డ్రా చేసుకున్నా..లేదా గెలిచినా..భారత్ టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది. అదే జరిగితే 15 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్లో భారత్ టెస్ట్ సిరీస్ గెలిచి రికార్డు సృష్టించనుంది. 2007లో ద్రావిడ్ సారథ్యంలో భారత్ టెస్టు సిరీస్ గెలవగా..ఇప్పుడు అదే ద్రావిడ్ టీమిండియాకు కోచ్గా వ్యవహరిస్తుండటం విశేషం.  అప్పుడు కోహ్లీ కెప్టెన్ కాగా..ఇప్పుడు రోహిత్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. 

మరిన్ని వార్తలు