బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలిచిన ఆర్సీబీ.. అనుష్క ముందే వెక్కి వెక్కి ఏడ్చిన విరాట్ కోహ్లీ 

బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలిచిన ఆర్సీబీ.. అనుష్క ముందే వెక్కి వెక్కి ఏడ్చిన విరాట్ కోహ్లీ 

Virat Kohli: ఐపీఎల్ 2026 టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న తర్వాత, సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ఐపీఎల్ ట్రోఫీ పట్టుకుని ఎమోషనల్ అయ్యాడని, భార్య అనుష్క శర్మను హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడని ఈ వీడియోలో కనిపిస్తుంది. కాగా ఈ వైరల్ వీడియో పూర్తిగా నకిలీది.. వాస్తవానికి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ సహాయంతో సృష్టించిన డీప్‌ఫేక్ వీడియో అని ఫ్యాక్ట్-చెక్ పరిశోధనల్లో తేలింది.

ఫేక్ వీడియో వైరల్: 
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో అనుష్క శర్మ తన మెడలో ఒక ప్రత్యేకమైన తులసి మాలను ధరించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత వచ్చిన నిజమైన ఫోటోలు, వీడియోలలో ఇది క్లియర్ గా కనిపించింది. కానీ వైరల్ అవుతున్న ఏఐ వీడియోలో ఆ తులసి మాల పూర్తిగా మాయమైపోయింది. ఇక వీడియోలో కోహ్లీ పట్టుకున్న ట్రోఫీ, అసలైన ఐపీఎల్ అధికారిక ట్రోఫీకి భిన్నంగా వింత ఆకారంలో ఉంది. అలాగే వీడియోలో విరాట్, అనుష్కల ముఖ కవళికలు, శరీర కదలికలు, బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఏఐ సృష్టించిన వీడియో లాగే కనబడుతుంది. 

ఎమోషనల్ మూమెంట్స్:  
ఫేక్ వీడియోలు ఒకవైపు తిరుగుతుంటే, నరేంద్ర మోడీ స్టేడియంలోని ఆర్సీబీ ఆటగాళ్ల అసలైన భావోద్వేగ క్షణాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మ్యాచ్ గెలిచిన వెంటనే విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లోకి అనుష్కను పిలిచి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు, కృనాల్ పాండ్యా కుమారుడితో సరదాగా గడపడం, అలాగే స్టేడియంలోని అభిమానులకు తన బ్యాటింగ్ ప్యాడ్‌లను బహుమతిగా ఇవ్వడం లాంటి ఎన్నో నిజమైన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.