జూన్ నెల మనీ గేమ్ షురూ.. మీ జేబును శాసించే 5 పెద్ద అప్‌డేట్స్ ఇవే

జూన్ నెల మనీ గేమ్ షురూ.. మీ జేబును శాసించే 5 పెద్ద అప్‌డేట్స్ ఇవే

కొత్త ఆర్థిక సంవత్సరం స్పీడందుకుంది.. క్యాలెండర్‌లో జూన్ 2026 పేజీ ఓపెన్ అయిపోయింది. జూన్ నెల మీ జేబుకు, మంత్లీ బడ్జెట్‌కు, మీ ఇన్వెస్ట్‌మెంట్లకు అత్యంత కీలకమైనదిగా మారబోతోంది. మీరు ఉద్యోగస్తులైనా, హోమ్ లోన్ ఈఎంఐలు కడుతున్న వారైనా, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బులు దాచుకున్న వారైనా.. లేదా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో రోజువారీ ట్రేడింగ్ చేసేవారైనా సరే.. ఈ నెలలో జరగబోయే 5 క్రేజీ ఫైనాన్షియల్ ఈవెంట్స్ పై కన్నేసి ఉంచాల్సిందే. మీ పైసల ప్లానింగ్‌ని పక్కాగా సెట్ చేసే ఆ 5 మేజర్ మనీ అప్‌డేట్స్ ఏంటో ఇప్పుడే చూసేద్దాం..

1. ఆర్బీఐ పాలసీ మీటింగ్:
జూన్ 3 నుండి జూన్ 5 వరకు రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరగనుంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. ఈసారి కూడా రెపో రేటును 5.25% వద్ద స్థిరంగా ఉంచే అవకాశం ఉంది. అయితే వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆర్బీఐ ఇచ్చే హింట్స్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్.
ఎవరిపై ఇంపాక్ట్?: హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారి ఈఎంఐల భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంటుంది. అలాగే FD ఇన్వెస్టర్లకు వడ్డీ రేట్లు ఎటువైపు వెళ్తాయో ఒక క్లారిటీ వస్తుంది.

2. అడ్వాన్స్ టాక్స్ డెడ్‌లైన్: 
ఆర్థిక సంవత్సరంలో మీరు కట్టాల్సిన పన్ను అంచనాలు రూ.10వేలు దాటితే.. మీరు అడ్వాన్స్ టాక్స్ కట్టాల్సి ఉంటుంది. దీని మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ గడువు జూన్ 15 అని అస్సలు మర్చిపోవద్దు.
ఎవరిపై ఇంపాక్ట్?: ఫ్రీలాన్సర్లు, వ్యాపారస్తులు, ట్రేడర్లు, కన్సల్టెంట్లు, ఇళ్ల అద్దెల ద్వారా భారీగా ఆదాయం పొందే వారు అలర్ట్‌గా ఉండాలి. డెడ్‌లైన్ మిస్సయితే ఆదాయపు పన్ను చట్టం కింద వడ్డీలు, పెనాల్టీలు మోత మోగుతాయి.

3. ద్రవ్యోల్బణం లెక్కలు:
మే నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం డేటా ఈ జూన్ లోనే రిలీజ్ కానుంది. మార్కెట్ సెంటిమెంట్‌ను శాసించే అంశాల్లో ఇన్‌ఫ్లేషన్ రేటు కూడా కీలకమైనదే.
ఎవరిపై ఇంపాక్ట్?: ధరలు కంట్రోల్‌లో ఉంటే వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి. ఒకవేళ ఫుడ్ లేదా క్రూడ్ ఆయిల్ ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరిగితే మాత్రం స్టాక్ మార్కెట్లు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ కుదుపునకు లోనవుతాయి.

4. IIP డేటా:
దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు కూడా ఈ నెలలోనే విడుదలవుతాయి. మైనింగ్, మానుఫ్యాక్చరింగ్, పవర్ సెక్టార్ల హెల్త్ కండిషన్ ఎలా ఉందో ఇది చెబుతుంది.
ఎవరికి ఇంపాక్ట్?: ఈ గ్రోత్ నంబర్స్ బలంగా ఉంటే ఇన్వెస్టర్లలో జోష్ పెరుగుతుంది. లేదంటే మార్కెట్లలో కాస్త మందగమనం ఉండొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. 

5. గ్లోబల్ క్యూస్: 
దేశీయ మార్కెట్లతో పాటు క్రూడ్ ఆయిల్ ధరలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వ్యాఖ్యలు, కరెన్సీ హెచ్చుతగ్గులు, విదేశీ ఇన్వెస్టర్ల ఫ్లోస్ వంటి గ్లోబల్ అంశాలు ఇండియన్ మార్కెట్‌ను ఎడ్జ్‌లో ఉంచనున్నాయి.
ఎవరిపై ఇంపాక్ట్?: క్రూడ్ ఆయిల్ పెరిగితే ఇంపోర్ట్-డిపెండెంట్ రంగాలు ప్రభావితమవుతాయి. రూపాయి విలువ మారితే అది స్టాక్ మార్కెట్ ఓలటాలిటీని పెంచుతుంది. ఇది మార్కెట్ సెంటిమెంట్లను నేరుగా దెబ్బతీసే అంశం. 

జూన్ అంటే కేవలం క్యాలెండర్ మార్పు కాదు.. మీ SIP రిటర్న్స్, లోన్ ఈఎంఐలు, టాక్స్ ప్లానింగ్‌లను డిసైడ్ చేసే అసలైన మనీ గేమ్. అందుకే అనవసరపు ఆందోళనలతో తప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలు తీసుకోకుండా.. పక్కాగా క్యాష్ ఫ్లో ప్లాన్ చేసుకోండి.