ముంబయి వీధుల్లో స్కూటీపై స్టార్ కపుల్ షికార్లు

ముంబయి వీధుల్లో స్కూటీపై స్టార్ కపుల్ షికార్లు

భారత కెప్టెన్, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ, అతని భార్య అనుష్క శర్మ ముంబయి వీధుల్లో కనిపించారు. మామూలుగా సెలబ్రెటీస్ అంటేనే లగ్జరీ కార్లలో తిరుగుతూ ఉంటారు. కానీ ఈ కపుల్ మాత్రం కాస్త కొత్తగా ఆలోచించారు. స్కూటీపై రైడ్ కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో కోహ్లీ స్కూటీ నడుపుతుండగా.. వెనక అనుష్క కూర్చుంది. వీరిద్దరూ హెల్మెట్లు పెట్టుకున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం వీరిని గుర్తు పట్టేశారు. వెంటనే తమ అభిమాన క్రికెటర్ ను ఫొటోలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలలో పంచుకున్నారు. 

ఎప్పుడూ క్రికెట్, ఫొటో షూట్స్, యాడ్స్ తో కెరీర్ లో బిజీగా ఉండే విరుష్క జంట ముంబైలోని మధ్ ఐలాండ్‌లో స్కూటీపై తిరుగుతూ కనిపించారు. ఇద్దరూ నల్లటి హెల్మెట్ పెట్టుకొని ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడ్డప్పటికీ జనాలు వారిని గుర్తు పట్టేశారు. కాగా ఇటీవలే టీమిండియా ఆటగాళ్లు లండన్ నుంచి కరేబియన్ దీవులకు వెళ్లగా.. కోహ్లి, అనుష్క శర్మ అక్కడే కొద్ది రోజులు గడిపి.. ఇటీవలే ఇండియా తిరిగొచ్చారు.