Cricket World Cup 2023: 8 ఇన్నింగ్స్ ల్లో 5 సార్లు ఔట్.. ఫైనల్‌కు ముందు కోహ్లీని కంగారెత్తిస్తున్న ఆసీస్ బౌలర్

Cricket World Cup 2023: 8 ఇన్నింగ్స్ ల్లో 5 సార్లు ఔట్.. ఫైనల్‌కు ముందు కోహ్లీని కంగారెత్తిస్తున్న ఆసీస్ బౌలర్

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ 2023 లో పరుగుల వరద పారిస్తున్నాడు. రన్ మెషీన్ ట్యాగ్ కు న్యాయం చేస్తూ  ఈ మెగా టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 10 ఇన్నింగ్స్ ల్లో 711 పరుగులు చేసిన కోహ్లీ 3 కి సెంచరీలు 5 హాఫ్ సెంచరీలు చేసి టాప్ ఫామ్ లో ఉన్నాడు. మ్యాచ్ ఆడితే హాఫ్ సెంచరీ లేకపోతే సెంచరీ చేసే కోహ్లీ ఒక విషయంలో ఆసీస్ బౌలర్ కంగారెత్తిస్తున్నాడు. అతడెవరో కాదు ఆసీస్ పేస్ బౌలర్ జోష్ హేజల్ వుడ్.
 
ఎంతోమంది ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే కోహ్లీ  జోష్ హేజల్ వుడ్ బౌలింగ్ లో ఘోర రికార్డ్ కలిగి ఉన్నాడు. వన్డేల్లో 8 ఇన్నింగ్స్ ల్లో ఈ పేసర్ బౌలింగ్ లో 88 బంతుల్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేసి 5 సార్లు ఔటయ్యాడు. యావరేజ్ 10 మాత్రమే ఉంది. హేజల్ వుడ్ వేసిన  88 బంతుల్లో విరాట్ ఒక్క సిక్స్ కూడా కొట్టకపోగా.. 3 ఫోర్లు మాత్రమే కొట్టాడు. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో నేడు(నవంబర్ 19) జరుగుతున్న ఫైనల్ కు ముందు ఈ చెత్త రికార్డ్ భారత అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది.

ఈ వరల్డ్ కప్ లో చెన్నైలో జరిగిన లీగ్ మ్యాచ్ లోనూ కోహ్లీ తన వికెట్ ను ఈ రైట్ ఆర్మ్ పేసర్ కు సమర్పించుకున్నాడు. 85 పరుగులు చేసి హేజల్ వుడ్ కు చిక్కాడు. భారత్ ఫైనల్లో విజయం సాధించాలంటే కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడటం చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఈ ఆసీస్ స్టార్ పేసర్ పై విరాట్ ఆధిపత్యం చూపించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)