ఐలాండ్ లో ఉల్లాసంగా విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ

ఐలాండ్ లో ఉల్లాసంగా విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ

పెర్త్‌‌‌‌‌‌‌‌: టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా.. ఐలాండ్స్‌‌‌‌‌‌‌‌లో ఉల్లాసంగా గడుపుతోంది. ఓవైపు ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ చేస్తూనే.. మరోవైపు దొరికిన టైమ్‌‌‌‌‌‌‌‌ను అద్భుతంగా సద్వినియోగించుకుంటున్నది. ఎంతో అందమైన ప్రదేశమైన రాట్‌‌‌‌‌‌‌‌ నెస్ట్‌‌‌‌‌‌‌‌ ఐలాండ్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం సందర్శించింది. బీచ్‌‌‌‌‌‌‌‌లో సేద తీరుతూ, సరదాగా ఫొటోలు దిగుతూ.. క్రూయిజ్‌‌‌‌‌‌‌‌పై ప్రయాణిస్తూ ప్లేయర్లు, సపోర్ట్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌ ఎంజాయ్‌‌‌‌‌‌‌‌ చేశారు.

విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ.. అత్యంత అరుదైన జంతువు ‘క్వోక్కా’తో ఫొటోలు దిగాడు. పెర్త్‌‌‌‌‌‌‌‌ తీరానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాట్‌‌‌‌‌‌‌‌నెస్ట్‌‌‌‌‌‌‌‌ ఐలాండ్‌‌‌‌‌‌‌‌.. 63 బీచ్‌‌‌‌‌‌‌‌ల సముదాయం. ఇందులో 20 బీచ్‌‌‌‌‌‌‌‌ల్లో అందమైన తీరప్రాంతం, పగడపు దిబ్బలు, వాటి శిథిలాలతో చూడముచ్చటగా ఉంటాయి. క్వోక్కా జంతువులకు ఈ ఐలాండ్‌‌‌‌‌‌‌‌ నిలయం.ఈ ఐలాండ్‌‌‌‌‌‌‌‌ను సముద్ర స్వర్గంగా కూడా పరిగణిస్తారు.