కోహ్లీకి నాలుగోసారి.. ఐసీసీ మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్డే క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2023

కోహ్లీకి నాలుగోసారి.. ఐసీసీ మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్డే క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2023

దుబాయ్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  టీమిండియా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్ట్రో విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ నాలుగోసారి ‘ఐసీసీ మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్డే క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2023’ అవార్డును గెలుచుకున్నాడు. దీంతో డివిలియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (మూడుసార్లు) రికార్డును బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. గతేడాది వన్డేల్లో 6 సెంచరీలు, 8 హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీలతో కలిపి మొత్తం 1377 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఇక సచిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయ్యెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్డే సెంచరీల రికార్డును దాటేసిన కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడిన 11 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 765 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించాడు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది ఏడో ఐసీసీ అవార్డు కాగా, వన్డేల్లో నాలుగోది. 2012, 2017, 2018లోనూ ఈ అవార్డును గెలిచాడు. 2018లో ‘టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అవార్డును కూడా నెగ్గిన కోహ్లీ.. 2017, 2018లో సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యారీఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోబెర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ (ఐసీసీ మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ని అందుకున్నాడు. అయితే ఈసారి గ్యారీఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోబెర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ.. కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దక్కింది.