కోహ్లీ చివరి సెంచరీ నాకైతే గుర్తు లేదు

కోహ్లీ చివరి సెంచరీ నాకైతే గుర్తు లేదు

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసి రెండేళ్లు అవుతోంది. 2019లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఇంటర్నేషనల్ సెంచరీ చేశాడు కోహ్లీ. ఇక అప్పటినుంచి పేలవమైనఫామ్ తో సతమతమవుతున్నాడు. చివరికి వరుసగా మూడు గోల్డెన్ డక్ ల చెత్త రికార్డు కూడా మూటగట్టుకున్నాడు. కోహ్లీ ఆటను చూసిన రవిశాస్త్రి లాంటి సీనియర్లు అతనిని బ్రేక్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ  క్రమంలో ఈ మాజీ కెప్టెన్ కు అండగా నిలిచాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇంగ్లండ్ తో జూలై 1 నుండి జరిగే ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో కోహ్లీ భారీ స్కోర్ చేయాలని కోరుకుంటున్నానని తెలిపాడు. "కోహ్లీ చివరిసారి ఎప్పుడు సెంచరీ చేశాడో మీకు గుర్తుందా? నాకు కూడా గుర్తు లేదు. సిరీస్ డిసైడర్ అయిన ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఖచ్చితంగా పెద్ద స్కోర్ చేయాలని కోరుకుంటున్నా" అని సెహ్వాగ్ వెల్లడించాడు. అంతేకాకుండా అతనికి చెడ్డ రోజులు ముగిసిపోయాయని, మంచి రోజులు వస్తాయని  భావిస్తున్నట్టుగా సెహ్వాగ్ చెప్పాడు. కాగా గత ఏడాది సెప్టెంబర్‌లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌, భారత్ ల మధ్య జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడింది. అప్పటికే భారత జట్టు 2-,1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచినా, డ్రా చేసుకున్నా సిరీస్ భారత్ వశమవుతుంది. ఈ టెస్ట్ మ్యా్చ్ కు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది.