దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహం 

V6 Velugu Posted on Oct 19, 2021

భారత క్రికెట్ జట్టు కు మూడు ఫార్మాట్ లలో కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్  మ్యూజియంలో నిర్వాహకులు సోమవారం అతడి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహంలో కోహ్లి.. టీమిండియా కొత్త జెర్సీ  వేసుకుని తనదైన బ్యాటింగ్ స్టైల్ తో ఉన్న విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

కోహ్లి మైనపు విగ్రహం ఆవిష్కరించడం ఇదేం కొత్త కాదు. ఇది రెండో సారి. 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా లండన్ లోని లార్డ్స్ లో ఆవిష్కరించారు. ఆ తర్వాత  అక్కడే ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు.

Tagged Virat Kohli, dubai, wax statue, Madame Tussauds museum

Latest Videos

Subscribe Now

More News