వచ్చేసిన్రు వర్చువల్‌‌‌‌ బాయ్‌‌‌‌ఫ్రెండ్స్‌‌‌‌

వచ్చేసిన్రు  వర్చువల్‌‌‌‌ బాయ్‌‌‌‌ఫ్రెండ్స్‌‌‌‌

చైనాలో వర్చువల్‌‌‌‌ బాయ్‌‌‌‌ఫ్రెండ్స్‌‌‌‌ కల్చర్‌‌‌‌ ఎక్కువవుతోంది. సింగిల్‌‌‌‌గా ఉంటున్న లేడీస్‌‌‌‌ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బాయ్‌‌‌‌ఫ్రెండ్స్‌‌‌‌ కోసం పోటీపడుతున్నారు. పైసలు కట్టి మరీ వాళ్లతో మాట్లాడుతున్నారు. మెసేజ్‌‌‌‌లు చేస్తున్నారు. వాళ్ల బాధలు, ఎమోషన్లను వేరే వాళ్లతో పంచుకొని మనసును కాస్త తేలిక చేసుకోవడానికే ఈ సెటప్‌‌‌‌ అంతా. చాటింగ్‌‌‌‌ పూర్తిగా ఫ్రెండ్లీగా, ఫ్లర్టింగ్‌‌‌‌గా సాగుతుంది. పొద్దున వేకప్‌‌‌‌ కాల్స్‌‌‌‌ నుంచి మెసేజ్‌‌‌‌లు పంపుకోవడం, చాటింగ్‌‌‌‌, వీడియో కాల్స్‌‌‌‌ వరకు అలా అలా జరిగిపోతుంటాయి.

యాప్‌‌‌‌లు, సైట్లలో.. వీచాట్‌‌‌‌ లాంటి యాప్‌‌‌‌లు, టావోబావో లాంటి ఈ కామర్స్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్లలో వర్చువల్‌‌‌‌ ఫ్రెండ్స్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ను అమ్ముతున్నారు. ఈ కల్చర్‌‌‌‌ చైనాలోని మిడిల్‌‌‌‌ క్లాస్‌‌‌‌ యువతుల్లో ఎక్కువగా కనబడుతోంది. వాళ్లంతా ఇప్పటికిప్పుడు పెళ్లి, ఫ్యామిలీ అనే ప్లాన్‌‌‌‌ లేకుండా కెరీర్‌‌‌‌పై దృష్టి పెట్టిన వాళ్లు. చాలా మంది సింగిల్‌‌‌‌గా ఉంటున్న, డబ్బు సంపాదిస్తున్న యువతులే ఎక్కువున్నారని కొందరు వర్చువల్‌‌‌‌ బాయ్‌‌‌‌ఫ్రెండ్స్‌‌‌‌ చెప్పారు. వర్చువల్‌‌‌‌ బాయ్‌‌‌‌ఫ్రెండ్స్‌‌‌‌తో మాట్లాడటానికి ధరలు గంటల నుంచి రోజుల లెక్కన ఉంటాయి.

పొద్దున ట్రేడర్‌‌‌‌.. రాత్రి బాయ్‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌

ఇరవై రెండేళ్ల ఝువాన్సున్‌‌‌‌ పొద్దున ఫారిన్‌‌‌‌ ఎక్స్‌‌‌‌చేంజ్‌‌‌‌ ట్రేడర్‌‌‌‌. రాత్రి వర్చువల్‌‌‌‌ బాయ్‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌. ఫీమేల్‌‌‌‌ క్లైంట్స్‌‌‌‌తో మాట్లాడుతుంటాడు. అతనితో చాట్‌‌‌‌ చేసే వాళ్లు కూడా రకరకాల కారణాలతో వస్తుంటారు. కొందరు ఫ్రెండ్లీ సలహాల కోసం, ఇంకొందరు రొమాంటిక్‌‌‌‌ రిక్వెస్ట్‌‌‌‌ల కోసం చాట్‌‌‌‌ చేస్తుంటారు. డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్లతో చాట్‌‌‌‌ చేసినా, మాట్లాడినా ఆ తర్వాత అంతా మర్చిపోతానని ఝువాన్సున్‌‌‌‌ చెప్పారు. ఇక 28 ఏళ్ల లిసా ఓ వర్చువల్‌‌‌‌ బాయ్‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌ను రెంట్‌‌‌‌కు తీసుకుంది. తనతో రొమాంటిక్‌‌‌‌గా మాట్లాడుతుంటుంది. ‘అఫ్‌‌‌‌కోర్స్‌‌‌‌.. మాట్లాడుతున్నప్పుడు ప్రేమ లాంటి ఫీలింగ్స్‌‌‌‌ కలుగుతాయి. కానీ నన్నొకరు ప్రేమిస్తున్నారనే ఫీలింగ్‌‌‌‌ బాగుంటుంది. ఏదేమైనా నేను జస్ట్‌‌‌‌ ఓ సర్వీస్‌‌‌‌ను డబ్బులిచ్చి కొనుక్కుంటున్నా అంతే’ అంటున్నారు లీసా.

వెయ్యి మందికి ఏడుగురే..

పితృస్వామ్య చైనాలో పెండ్లి కంపల్సరీ వ్యవహారం. అయితే 1979లో వన్‌‌‌‌ చైల్డ్‌‌‌‌ పాలసీ వచ్చాక ఫ్యామిలీల సైజు తగ్గింది. అమ్మాయిలను కూడా అబ్బాయిల్లా తల్లిదండ్రులు పెంచడం మొదలుపెట్టారు. దీంతో మహిళలు కూడా బాగా సంపాదించే వాళ్లుగా ఎదిగారు. మరోవైపు చైనాలో పెండ్లిళ్ల సంఖ్య యేటా తగ్గుతోంది. కెరీర్‌‌‌‌ రేసులో పడి పెండ్లిని చాలా మంది పక్కనబెట్టేస్తున్నారు. అంతా సెటిలయ్యాకే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు. చైనాలో ప్రతి 1000 మందికి 7.2 మందే పెండ్లి చేసుకుంటున్నారని ఓ సర్వే. ఇక చైనాలో సెక్స్‌‌ సెలెక్షన్‌‌ అబార్షన్లు కూడా ఎక్కువ. 2018 నాటికి 100 మంది అమ్మాయిలకు 114 మంది అబ్బాయిలున్నారు.