కరోనా ఆంక్షల సడలింపులతో పెరిగిన వీసా అప్లికేషన్లు

కరోనా ఆంక్షల సడలింపులతో పెరిగిన వీసా అప్లికేషన్లు

న్యూఢిల్లీ: అమెరికా వీసాల కోసం మళ్లీ కష్టాలు పెరిగాయి. విజిటర్స్ వీసాకు అప్లై చేసుకున్నోళ్లు అపాయింట్​మెంట్ (స్లాట్​) కోసం కనీసం 500 రోజులు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా దేశాలు కరోనా ​ఆంక్షలను సడలిస్తుండడం, అంతర్జాతీయ విమాన సర్వీసులను స్టార్ట్​ కావడంతో చాలా మంది ఇండియన్లు విదేశాల్లో పర్యటించాలని ప్లాన్​ చేసుకుంటున్నారు. దీంతో యూఎస్​ వీసాకోసం విపరీతంగా అప్లికేషన్లు వస్తున్నాయి. దీంతో ప్రాసెసింగ్​కు టైం పడుతోందని అధికారులు చెప్తున్నారు. విజిటర్స్ వీసా రావాలంటే దాదాపు ఏడాదిన్నర పడుతోందని యూఎస్ విదేశాంగ శాఖ అధికారులు చెప్తున్నారు. 

ఢిల్లీలో అప్లై చేసుకోన్నోళ్లకు 582 రోజులు

ఆ శాఖ వెబ్​సైట్​Travel.State.Gov ప్రకారం.. న్యూఢిల్లీలోని యూఎస్​ కాన్సులేట్​లో విజిటర్​ వీసా కోసం అపాయింట్​మెంట్ ​కావాలంటే 582 రోజులు ఆగాలి. అలాగే స్టూడెంట్​ వీసాకు 471 రోజులు వెయిట్​చేయాలి. ముంబైలోని యూఎస్​కాన్సులేట్​లో విజిటర్​ వీసా అపాయింట్​మెంట్​కోసం పట్టే యావరేజ్​ వెయిటింగ్  టైమ్​517 ​రోజులు కాగా స్టూడెంట్ ​వీసాకు 10 రోజులు. విజిటర్ ​వీసా కోసం హైదరాబాద్​లోని కాన్సులేట్​లో యూఎస్ ​వీసా అపాయింట్​మెంట్​కు పట్టే యావరేజ్ ​వెయిటింగ్ ​టైమ్ 518 రోజులుకాగా.. స్టూడెంట్ ​వీసాకు 479 రోజులు. విజిటర్​వీసా కోసం కోల్​కతాలోని యూఎస్ ​కాన్సులేట్​అపాయింట్​మెంట్​కు 587 రోజులు కాగా, స్టూడెంట్​ వీసాకు 2 రోజులు. చెన్నైలోని అమెరికా కాన్సులేట్​లో విజిటర్​వీసా కోసం యావరేజ్​ వెయిట్ ​టైమ్​513 క్యాలెండర్​ రోజులు, స్టూడెంట్​వీసాకు 8 రోజులు పట్టనుంది. 

కొవిడ్​వల్ల విధించిన లాక్​డౌన్​ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వీసా సర్వీసులకు ఆటంకం కలిగిందని లిబరేషన్​క్యాటో ఇన్​స్టిట్యూట్​లో ఇమిగ్రేషన్​ పాలసీ అసోసియేట్​ డైరెక్టర్​ డేవిడ్​ బెయిర్​తెలిపారు. కొవిడ్​ సమయంలో వీసా కార్యకలాపాలు ఆగిపోయాయని, ఇపుడు కొవిడ్​ ఆంక్షలను సడలించడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఒక్క అమెరికానే కాకుండా యూకే, కెనడా వంటి దేశాలకు కూడా వీసా అప్లికేషన్​ ప్రాసెసింగ్​కు చాలా టైమ్​పడుతోంది. ఉదాహరణకు యూకేలో వీసా ప్రాసెసింగ్​టైమ్​కు నాలుగు నుంచి పది వారాలు పడుతోంది. ఇక జర్మనీ పర్మనెంట్​స్టే వీసాలను తీసుకోవడం ఆపేసింది. షార్ట్​స్టే వీసాలు, రెసిడెన్స్​పర్మిట్లకు అప్లికేషన్లను తీసుకోవడం తాత్కాలికంగా నిలిపివేశామని ఈ ఏడాది మే 30న ఇండియాలో డానిష్​ఎంబసీ ప్రకటించింది. అయితే గత నెల 6న ఈ అప్లికేషన్లను తీసుకోవడం మళ్లీ ప్రారంభించింది. 

త్వరలో యూకే పీవీ, ఎస్​పీవీ సర్వీసులు

స్పాన్సర్డ్​వర్క్​రూట్స్, స్టూడెంట్​వీసాల పథకం కింద వచ్చే దరఖాస్తుల కోసం స్టార్ట్​ద ప్రయారిటీ వీసా (పీవీ), సూపర్​ప్రయారిటీ వీసా (ఎస్​పీవీ) సేవలను యూకే త్వరలోనే పున:ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో వచ్చే కొద్ది వారాల్లో భారీ సంఖ్యలో అప్లికేషన్లు రావొచ్చని, తమ దరఖాస్తులను వీలైనంత త్వరగా అందజేయాలని స్టూడెంట్లకు ఇండియాలోని బ్రిటిష్ హై కమిషన్ సూచించింది. ‘‘యూకేకు వెళ్లేందుకు 15 రోజుల్లోనే చాలా మందికి వీసాలు వస్తున్నాయి. ప్రాసెసింగ్​కు ఎక్కువ టైమ్ ​పడుతోంది.

ఇందుకు కరోనా తర్వాత యూకే వీసాలకు విపరీతమైన డిమాండ్,  రష్యా‌‌‌‌–ఉక్రెయిన్​ యుద్ధమే ఇందుకు కారణం” అని ట్విట్టర్​లో యూకే హైకమిషనర్ ఎలిస్ చెప్పారు. ఇంటర్నేషనల్​ ఫ్లైట్లను మళ్లీ తెరవడంతో విదేశీ పర్యటనకు డిమాండ్​ ఏర్పడిందని వీసా ఏజెన్సీ వీఎఫ్​ఎస్ ​గ్లోబల్ ​ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘‘కొవిడ్​ టైమ్​లో ఇండియాకు తిరిగివచ్చినన స్టూడెంట్లు, వర్కింగ్​ప్రొఫెషనల్స్​మళ్లీ ఆయా దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో భారీగా వీసా అప్లికేషన్లు వస్తున్నాయి. వీటిని ప్రాసెస్​చేసేందుకు ఎక్కువ టైమ్​పడుతోంది” అని తెలిపారు.