టీడీపీ ఎమ్మెల్యే గంటాకు షాక్ : రెండేళ్ల క్రితం రాజీనామా లేఖ.. ఇప్పుడు ఆమోదం

టీడీపీ ఎమ్మెల్యే గంటాకు షాక్ : రెండేళ్ల క్రితం రాజీనామా లేఖ.. ఇప్పుడు ఆమోదం

మాజీ మంత్రి , టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్​ ఆమోదించారు. స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంట రెండేళ్ల క్రితం రాజీనామా చేశారు. అప్పటి నుంచి పెండింగ్​ లో ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఎట్టకేలకు  సోమవారం ( జనవరి 22)న ఆమోదించారు. 

 విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాను ఎట్టకేలకు అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. విశాఖ నార్త్​ నియోజకవర్గం .. టీడీపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి  రెండేళ్ల క్రిత్రం చేసిన రాజీనామాను ఈనెల 22న ఆమోదించినట్టు అసెంబ్లీ సెక్రెటరీ  తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ 2021, ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా సమర్పించారు.

రెండేళ్ల నుంచి

 విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిపై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. అయితే రెండేళ్ల నుంచి ఆయన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించలేదు.  రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్​ టాపిక్​ గా చర్చనీయాంశమైంది.