సినీ ఫక్కీలో ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ : 4 గంటల్లో చేధించిన పోలీసులు

సినీ ఫక్కీలో ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ : 4 గంటల్లో చేధించిన పోలీసులు

విశాఖపట్నం లోక్​ సభ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. సినీ ఫక్కీ జరిగిన ఈ కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు ప్రాథమిక వివరాలు వెల్లడించారు. 

ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆడిటర్ జీవీ కుమారుడి ఇంట్లో.. ఎంపీ కుమారుడు శరత్ ఉన్నారు. ఆ సమయంలో.. రౌడీషీటర్ అయిన హేమంత్ అండ్ గ్యాంగ్.. ఇంట్లోకి చొరబడి ఎంపీ కుమారుడు శరత్ ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత కుమారుడు శరత్ ను అడ్డుపెట్టుకుని ఎంపీ భార్య జ్యోతిని వారు ఉన్న ప్రదేశానికి రప్పించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆడిటర్ జీవీకి ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. కిడ్నాపర్లు అడిగిన డబ్బుతో ఆడిటర్ జీవీ.. కిడ్నాపర్లు చెప్పిన ప్రాంతానికి వెళ్లారు. కోటి రూపాయలు తీసుకున్న కిడ్పాపర్ లీడర్ హేమంత్.. మరో 50 కోట్లు కావాలని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. 

ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ అయ్యిందని.. డబ్బులు తీసుకుని ఆడిటర్ జీవీ వెళ్లారనే సమాచారం విశాఖపట్నం పోలీసులు వచ్చింది. 2023, జూన్ 15వ తేదీ ఉదయం ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగారు. విశాఖపట్నంలోని అన్ని టీమ్స్ ను యాక్టివ్ చేశారు. చెక్ పోస్టులు పెట్టారు. ఫోన్ల లొకేషన్ ను ట్రాక్ చేస్తూ.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కిడ్నాపర్ల చెర నుంచి ఎంపీ భార్య, కుమారుడుతోపాటు ఆడిటర్ ను క్షేమంగా విడిపించారు. వాళ్లను కిడ్పాన్ అయిన ప్రదేశం నుంచి విశాఖపట్నం తీసుకొచ్చారు. 

కిడ్నాప్ ప్లాన్ చేసింది రౌడీషీటర్ హేమంత్ గా గుర్తించారు పోలీసులు. ఇతనిపై ఓ హత్య కేసుతోపాటు.. మూడు కిడ్పాప్ కేసులు ఉన్నాయి. ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి.. ఇటీవల జైలు నుంచి విడుదల అయినట్లు చెబుతున్నారు పోలీసులు. 

కిడ్నాప్ అయిన ఎంపీ భార్య, కుమారుడుతోపాటు ఆడిటర్ నుంచి వివరాలు సేకరించిన తర్వాత.. మీడియా పూర్తి సమాచారం అందిస్తామని అంటున్నారు విశాఖపట్నం పోలీసులు. ఓ ఎంపీ కుటుంబాన్ని టార్గెట్ చేసి.. అది కూడా సిటీలో కిడ్నాప్ చేయటం అనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎంతో సెక్యూరిటీ, బందోబస్తు మధ్య ఉండే ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ కావటం అనేది చర్చనీయాంశం అయ్యింది.