సెప్టెంబర్ 12, 13 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు : విశారదన్ మహారాజ్

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు :  విశారదన్ మహారాజ్
  • ఇయ్యాల, రేపు  రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు
  • ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్

ముషీరాబాద్, వెలుగు : అగ్ర కులాలవారు అధ్యక్షత వహిస్తున్న పార్టీల నాయకత్వాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, సబ్బండ కులాలకు అప్పగించాలని ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ డిమాండ్ చేశారు. అగ్రకులాల పార్టీల తీరుకు నిరసనగా మంగళవారం, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆయా పార్టీల దిష్టిబొమ్మల దహనం చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ కార్యాలయం నుంచి  ప్రకటన విడుదల చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో 93% ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని, ఏడు శాతం కూడా లేని అగ్రకులాల నేతలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, సీపీఎం, వైఎస్ఆర్టీపీలకు నాయకత్వం వహించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.  సామాజిక న్యాయం, భారత రాజ్యాంగ సమానత్వ భావన,  ప్రజాస్వామ్యానికి ఇది వ్యతిరేకమన్నారు. అందుకే ఈ ఏడు అగ్రకులాల పార్టీల వైఖరిపై ధర్మసమాజ్ పార్టీ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తోందన్నారు.  రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ, డీజీపీ  మొదలుకొని ఉన్నతాధికారుల స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ అధికారులతో నింపాలని డిమాండ్ చేశారు.