Vishal: నా శరీరంలో వంద కుట్లు ఉన్నాయి.. డాక్టర్స్ చెప్పినా వినలేదు

Vishal: నా శరీరంలో వంద కుట్లు ఉన్నాయి.. డాక్టర్స్ చెప్పినా వినలేదు

తమిళ స్టార్ విశాల్(Vishal) కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. ఈక్రమంలో విశాల్ ను తెలుగు ప్రజలు ఎప్పుడో ఓన్ చేసేసుకున్నారు. ప్రెజెంట్ ఆయన నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ రత్నం(Rathnam). మాస్ చిత్రాలు దర్శకుడు హరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న హీరో విశాల్.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్ళు అవుతోంది. నా ఈ ప్రయాణంలో సపోర్ట్ గా నిలిచిన నా ఫ్యాన్స్, సినిమా లవర్స్, మీడియాకి నా ధన్యవాదాలు. వారిని అలరించడమే నా లక్ష్యం. అందుకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను. కొన్ని సార్లు నా డాక్టర్స్ చెప్పినా పట్టించుకోకుండా ముందుకు వెళ్లాను. వాడు.. వీడు సినిమా కోసం మెల్లకన్నుతో యాక్ట్ చేశారు. డాక్టర్స్ వద్దన్నారు కానీ, వినకుండా చేశాను. అలా చేసినందుకు నా ఒంట్లో ఇప్పుడు వంద కుట్లు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళ మాట వినకుండా రిస్కీ షాట్స్ చేస్తూనే ఉన్నాను. నన్ను నమ్మి డబ్బులు పెట్టిన నిర్మాత బాగుండాలనేది ఈ ప్రయత్నం. అందుకే ఎంత రిస్క్ అయినా చేయడానికైనా సిద్ధం అంటూ చెప్పుకోచ్చారు విశాల్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక విశాల్ తరువాతి సినిమాల విషయానికి వస్తే.. రత్నం తరువాత విశాల్ తుప్పరివాళన్ 2లో నటిస్తున్నారు. 2017లో వచ్చిన సూపర్ హిట్ మూవీ తుప్పరివాళన్ సినిమాకు ఇది సీక్వెల్. డిటెక్టీవ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సీక్వెల్ లో విశాల్ హీరోగా చేస్తూ.. దర్శకత్వం కూడా చేస్తుండటం వీశేషం. రత్నం రిలీజ్ తరువాత తుప్పరివాళన్ సినిమాపై పూర్తి దృష్టి పెట్టనున్నాడు విశాల్. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.