
విశాల్ హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘రత్నం’. శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. ఇందులో విశాల్ ఇంటెన్స్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. ఓ పెద్ద ఖాళీ స్థలంలో హెవీ ట్రక్కులు.. ఒక దానిలో నుంచి విశాల్ దిగి.. విలన్ తలను నరుకుతూ కనిపించాడు.
వెనుక జాతర వాతావరణం కనిపిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, జీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.