
హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీ, బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలు అందించే హైదరాబాద్ కంపెనీ ఇండిగ్రేటర్స్ కొత్త సీఈఓగా విశాల్ మణిని నియమించింది. ఐటీ సర్వీసులు, జీసీసీ అడ్వైజరీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఈ సంస్థకు నైపుణ్యం ఉంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ), సాఫ్ట్‌వేర్ ఆర్అండ్ డీ లాంటి విభాగాల్లో విశాల్‌కు 20 ఏళ్లపాటు పనిచేశారు.
ఇది వరకు ఆయన 12 ఏళ్లకు పైగా నెమెట్‌స్చెక్ ఇండియా (స్పేస్‌వెల్ ఇండియా) మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. ఇన్ఫోసిస్, కార్గిల్ వంటి సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేశారు. ఆటోమేషన్, డిజిటల్ ఆపరేషన్స్, ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ లాంటి వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు మెరుగైన ఫలితాలు అందించేందుకు కృషి చేస్తానని విశాల్ ఈ సందర్భంగా తెలిపారు.