
మెగా హీరో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆదికేశవ(Aadikeshava). యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటించిన ఈ మూవీని కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కించాడు. సితార ఎంటర్టైన్మెంట్ పై నాగవంశీ నిమించిన ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. రొటీన్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. దీంతో డిజాస్టర్ రిజల్ట్ ను దక్కించుకుంది ఈ మూవీ.
ఇక థియేట్రికల్ రన్ ముగుంచుకున్న ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు డిసెంబర్ 22 నుండి ఆదికేశవ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. ఇదే విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఆదికేశవ సినిమాను థియేటర్స్ లో చూడటానికి ఆడియన్స్ ఇష్టపడలేదు. దీంతో ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. మరి థియేటర్ లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.